Holidays | బడులకు.. ఎండాకాలం సెలవులొచ్చేశాయ్! ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే

విధాత: తెలంగాణలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి, ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో, స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయని విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. పాఠశాలలు తిరిగి జూన్ 12న ప్రారంభం కానున్నాయి.
ఈ షెడ్యూల్‌ను తెలంగాణ అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారమే నిర్ణయించినట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కపూట బడుల విధానం అమలులో ఉంది. ఉదయం మాత్రమే పాఠశాలలు కొనసాగుతున్నాయి. అయితే, వేసవి సెలవులు రాగానే మొత్తం 45 రోజులకుపైగా పాఠశాలలు మూతపడనున్నాయి. వేసవి సెలవుల ప్రకటనతో విద్యార్థులకు వేసవిలో విశ్రాంతి లభించనుంది. దీంతో తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో పర్యటనలను సిద్ధం చేసుకునే వెసులుబాటు కల్గింది.