వైసీపీ ప్రభుత్వమే కరోనాని పెంచి పోషిస్తోంది

ప్రభుత్వ చేతకానితనం, జగన్ బాధ్యతా రాహిత్యం వల్లే రాష్ట్రంలో కరోనా విలయతాoడవం విధాత :కరోనాని నివారించేందుకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వ మే కరోనాని వ్యాప్తి చేసేలా వ్యహరించటo బాధాకరం. సంక్షేమ పథకాల పేరుతో లభ్ది దారుల బ్యాంకు ఖాతాల్లో అర కోర నిధులు వేసి, కరోనా సమయంలో వారిని బ్యాంకుల చుట్టు తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బ్యాంకుల వద్ద కనీస కరోనా నిబంధనలు పాటిoచటం లేదు. ప్రజలు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా గుమిగూడి కుడు తున్నా […]

వైసీపీ ప్రభుత్వమే కరోనాని పెంచి పోషిస్తోంది

ప్రభుత్వ చేతకానితనం, జగన్ బాధ్యతా రాహిత్యం వల్లే రాష్ట్రంలో కరోనా విలయతాoడవం

విధాత :కరోనాని నివారించేందుకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వ మే కరోనాని వ్యాప్తి చేసేలా వ్యహరించటo బాధాకరం. సంక్షేమ పథకాల పేరుతో లభ్ది దారుల బ్యాంకు ఖాతాల్లో అర కోర నిధులు వేసి, కరోనా సమయంలో వారిని బ్యాంకుల చుట్టు తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బ్యాంకుల వద్ద కనీస కరోనా నిబంధనలు పాటిoచటం లేదు. ప్రజలు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా గుమిగూడి కుడు తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

ముఖ్యమంత్రి మాత్రం ఇంటి నుంచి బయటకు రారు, కానీ ప్రజలు మాత్రం మీరిచ్చే 5 వేలకు,10 వేలకు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాలా? ఆ డబ్బులేవో వాలంటీర్ల చేత పంపిణీ చేయొచ్చు కదా? దేశం అంతా సామాజిక దూరం పాటిస్తుంటే ఏపీలో మాత్రం సామూహిక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వైసీపీ నేతలు కరోనా నిబంధనలు ఉల్లంగించి రాజకీయ సభలు, సమావేశలు, ర్యాలీలు నిర్వహించి రాష్ట్రంలో కరోనా వ్యాపికి కారణమయ్యారు.

మళ్ళి ప్రభుత్వం ఈ విధంగా కరోనా వ్యాప్తి చేస్తోంది. ప్రజలు ఏమైతే మాకేంటి అన్నట్లుగా ముఖ్యమంత్రి,వైసీపీ నేతలు వ్యహరిస్తున్నారు.ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంగా వ్యహరిస్తున్నారు. మంత్రులు, అధికారులతో సమావేశాల్లో ముఖ్యమంత్రి ఏనాడు మాస్కు ధరించిన దాఖలాలు లేవు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, జగన్ బాధ్యతా రాహిత్యం వల్లే రాష్ట్రంలో కరోనా విలయతాoడవం చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరోనాని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి.అనగాని సత్య ప్రసాద్ అనిఅన్నారు.