ఏపీలో అధికార వైసీపీ కక్షసాధింపులతో పరిస్థితులు ఎమర్జెన్సీ రోజుల కన్నా దారుణంగా తయారయ్యాయి…
విధాత:సొంత పార్టీ ఎంపీపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలకు పరాకాష్ట.ప్రశ్నిస్తే మీడియాను కూడా కేసుల్లో ఇరికించేలా దిగజారిపోయారు.ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలను బెదిరించి ఏబీఎన్, టీవీ 5 ప్రసారాలను చాలా వరకు నియంత్రించారు. ఇప్పుడు ఆ రెండు ఛానళ్లపై రాజద్రోహం కేసు బనాయించి భావ ప్రకటన స్వేచ్ఛనూ హరించేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులపై కూడా అక్రమ కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే ఇంకా పెడతామని బెదిరిస్తున్నారు.మీడియా స్వేచ్ఛ హరించడం.. అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం..వ్యాపారాలు దెబ్బతీయడం ఈ అరాచకాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి సోమిరెడ్డి తెలిపారు.