Upasana | డెలివ‌రీకి వెళ్లే ముందు ఉపాస‌న పింక్ క‌ల‌ర్ టీ ష‌ర్ట్ ధరించ‌డం వెన‌క కార‌ణం ఏంటి?

Upasana | గ‌త కొద్ది రోజులుగా ఎక్క‌డ చూసిన ఉపాస‌న‌, రామ్ చ‌రణ్ జంట గురించే చ‌ర్చ న‌డుస్తుంది. ప‌దేళ్లకి పైగా వీళ్లు ఎందుకు పిల్ల‌ల‌ని క‌న‌కుండా ఉన్నారు, వీళ్ల‌కు పుట్ట‌బోయేది అమ్మాయే అని తెలుసా, పాప‌కి ఏ పేరు పెడ‌తారు, ఎవ‌రి పోలిక‌లు వ‌చ్చాయి ఇలా ప‌లు అంశాల గురించి తెగ ముచ్చ‌టించుకుంటున్నారు. అయితే జూన్ 20న జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుప‌త్రిలో తెల్ల‌వారుఝామున 1.49ని.లకి పాప జ‌న్మించింది. జూన్ 23వ తేదీన డిశ్చార్జ్ చేశారు. […]

  • By: sn    news    Jun 28, 2023 8:14 AM IST
Upasana | డెలివ‌రీకి వెళ్లే ముందు ఉపాస‌న పింక్ క‌ల‌ర్ టీ ష‌ర్ట్ ధరించ‌డం వెన‌క కార‌ణం ఏంటి?

Upasana |

గ‌త కొద్ది రోజులుగా ఎక్క‌డ చూసిన ఉపాస‌న‌, రామ్ చ‌రణ్ జంట గురించే చ‌ర్చ న‌డుస్తుంది. ప‌దేళ్లకి పైగా వీళ్లు ఎందుకు పిల్ల‌ల‌ని క‌న‌కుండా ఉన్నారు, వీళ్ల‌కు పుట్ట‌బోయేది అమ్మాయే అని తెలుసా, పాప‌కి ఏ పేరు పెడ‌తారు, ఎవ‌రి పోలిక‌లు వ‌చ్చాయి ఇలా ప‌లు అంశాల గురించి తెగ ముచ్చ‌టించుకుంటున్నారు.

అయితే జూన్ 20న జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుప‌త్రిలో తెల్ల‌వారుఝామున 1.49ని.లకి పాప జ‌న్మించింది. జూన్ 23వ తేదీన డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయ్యాక రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న దంప‌తులు మీడియా ముందుకి వ‌చ్చి ఫోటోల‌కి పోజులిచ్చారు. ఆ పిక్స్ ఇంటర్నెట్‌ని ఎంత‌గా షేక్ చేసాయో మ‌నంద‌రికి తెలిసిందే. అయితే ఉపాస‌న డెలివ‌రీ అయ్యి త‌న అత్త‌గారింటికి వెళ్లాక కూడా ఆమెకి సంబంధించిన అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఉపాస‌న డెలివ‌రీకి ముందు పింక్ టీ ష‌ర్ట్ ధ‌రించి చాలా సింపుల్‌గా ఆసుప‌త్రికి వెళ్లింది. అయితే ఆ రోజు ఉపాస‌న ధ‌రించిన పింక్ ష‌ర్ట్ గురించే అంతటా చ‌ర్చ న‌డుస్తుంది. ఉపాస‌న ధ‌రించిన బేబీ పింక్ కలర్ టీ షర్ట్ గూచీ కంపెనీకు చెందినదిగా కాగా, దాని ధ‌ర అక్ష‌రాలా రూ. 48 వేలు అని టాక్.

త‌న‌కి పాప ప‌డుతుంద‌ని తెలుసుకు కాబ‌ట్టి ముందే ఆ పింక్ క‌ల‌ర్ టీ ష‌ర్ట్ వేసుకొని ఆసుప‌త్రికి వెళ్లింద‌ని ప‌లువురు చెప్పుకొస్తున్నారు. ఇదే కాక ఉపాస‌న ప్రెగ్నెంట్ అయిన ద‌గ్గ‌ర నుం ప‌లుమార్లు పింక్ క‌ల‌ర్ డ్రెస్ వేసుకుంది. త‌న సీమంతం రోజు కూడా ఉపాసన పింక్ కలర్ డ్రెస్ లో క‌నిపించ‌గా, ఉప్సీ – ఆర్సి అనే పార్టీని ఏర్పాటు చేసిన‌ప్పుడు ఆ స‌మ‌యంలో కూడా బేబి పింక్ క‌ల‌ర్ లాంగ్ ఫ్రాక్‌లో మెరిసింది ఉపాస‌న‌.

ఉపాస‌న త‌న‌కి పుట్టేది అమ్మాయి అని తెలిసే ఇలా ప‌లుమార్లు పింక్ డ్రెస్‌లో మెరిసింద‌ని, డెలివ‌రీకి వెళ్లే ముందు కూడా పింక్ టీష‌ర్ట్‌లో క‌నిపించింద‌ని ప‌లువురు చెప్పుకొస్తున్నారు. ఏదేమైన ఇప్పుడు ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇక రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసన ప్రతీసారి తన ష్యాషన్ సెన్స్ తో ప్ర‌తి ఒక్క‌రి దృష్టినీ ఆకర్షిస్తుందనే చెప్పాలి. ప్ర‌గ్రెంట్ అయిన త‌ర్వాత కూడా ఉపాస‌న చాలా ట్రెండీ దుస్తుల‌లో క‌నిపించి వావ్ అనిపించింది. ఇక 21వ రోజు రామ్ చ‌ర‌ణ్ -ఉపాసన త‌మ కూతురు పేరు రివీల్ చేయ‌బోతున్నార‌ని, ఆ పేరు ఏమై ఉంటుందా అని మెగా అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.