విధాత: శ్రీలీల ఇప్పుడు ఏ నోటా విన్నా ఈ అమ్మడి పేరే. తెలుగునాట ప్రస్తుతం ఈ పేరు సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మూడేండ్ల క్రితం రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లిసందD చిత్రం ద్వారా తెలుగునాట అడుగుపెట్టిన ఈ అచ్చతెలుగు పదహారణాల తెలుగు ముద్దుగుమ్మ ఆ చిత్రం ఫెయిలైనప్పటికీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్నది.
ఇప్పటివరకు శ్రీలీల నటించిన సినిమాలు మూడు మాత్రమే విడుదలైనప్పటికీ ఇప్పుడు గంటకు కోటిన్నర వరకు డిమాండ్ చేస్తు కథానాయకులకు పోటీ ఇస్తున్నది. బడా హీరోలను సైతం తన కాల్షీట్ల కోసం క్యూ కట్టేలా చేస్తున్నది. అదే సమయంలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన వచ్చిన అవకాశాలను జార విడుచుకోకుండా డజన్ సినిమాలను లైన్‌లో పెట్టింది. దీంతో శ్రీలీల దెబ్బకు పూజాహెగ్డే, రష్మిక వంటి టాప్ హీరోయిన్లు సైతం ఇక్కడ అవకాశాలు లేక వేరే ఇండస్ట్రీల వైపు మళ్లారు.
శ్రీలీల ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్, మహేశ్‌బాబుతో గుంటూరు కారం, బాలకృష్ణ భగవంత్ కేసరి, వైష్ణవ్‌తేజ్‌తో ఆదికేశవ, నితిన్‌తో ఎక్ట్రా ఆర్డినరీ, విజయ్ దేవరకొండతో ఓసినిమా ఇవి గాక మరో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇందులో మూడు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే కొత్తగా వచ్చిన ప్రతి అవకాశానికి కమిట్ అయిన శ్రీలీల ఇప్పుడు వాటికి న్యాయం చేయలేక కిందా మీద పడుతున్నది. ఏ సినిమాకు ఎప్పుడు డేట్స్ అడ్జ్సట్ చేయాలో అర్థంగాక తలపట్టుకుంటున్నది.
ఈ క్రమంలో కొన్ని సినిమాల నుంచి తప్పుకునేందుకు కూడా శ్రీలీల సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో చేయబోతున్న సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ సినిమా ప్రోడ్యూసర్స్ మాత్రం శ్రీలీలే నటిస్తుందని ఖరాకండిగా చెబుతుండడంతో అమె డేట్స్‌పై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలోనే మరికొన్ని సినిమాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తంది.
ఈ సందర్భంగా కొందరు సినీ విమర్శకులు, అభిమానులు శ్రీలీల ఇన్ని సినిమాలు ఎలా ఒప్పుకుంది. ఎలా డేట్స్ అడ్జస్ట్ చేస్తుంది. ముందు అంగీకరించి.. తర్వాత తప్పుకోవడం ఎందుకు? అంటూ ప్రశ్నిస్తున్నారు. డేట్స్ చూసే, ఇచ్చే విషయంలో క్లారిటీ లేదా? ఎడా పెడా ఒప్పేసుకుంది.. ఇప్పుడు అటు, ఇటు అంటూ అల్లాడి పోతుందంటూ కామెంట్ చేస్తున్నారు. కొద్దిరోజులైతే గానీ తెలియదు శ్రీలీల ఏ సినిమాలో ఉంటుంది. ఉండనిది. విష్ యూ బెస్టాఫ్ లక్.