Rashi Phalalu | మార్చి 28, శుక్ర‌వారం.. ఈ రోజు మీ రాశి ఫలాలు! వారికి వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది

  • By: sr    news    Mar 28, 2025 10:31 AM IST
Rashi Phalalu | మార్చి 28, శుక్ర‌వారం.. ఈ రోజు మీ రాశి ఫలాలు! వారికి వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది

Horoscope | జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి చెర‌గ‌ని నమ్మకం. లేచిన నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెతికేది వారికి ఆరోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం మార్చి 28,  శుక్ర‌వారం రోజు వారి వారి పేర్ల మీద‌ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

 

మేషం (Aries) : ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలక్షేపం. ఒక ముఖ్యమైన పని పూర్తి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలం. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం. ప్రయత్నకార్యాల్లో విజయం. ఆకస్మిక ధనలాభం. సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది.
.
వృషభం (Taurus) : విదేశీయాన ప్రయత్నం సులభం. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఒక‌టి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం. ఆకస్మిక ధననష్టం. పిల్లలతో జాగ్రత్త . వృత్తి, ఉద్యోగస్తుల‌కు ప‌లు ఆటంకాలు. ఆరోగ్యం విష‌యంలో శ్రద్ధ అవసరం. ఇత‌రుల‌తో ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. నిలకడగా వ్యాపారాలు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగే అవ‌కాశం.

మిథునం (Gemini) : వీరికి ఆదాయం పెరిగే సూచనలు. వృత్తి, ఉద్యోగరంగాల్లో వృద్ధి. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఆత్మీయులను కలవడంలో విఫలం. ఆశించిన శుభవార్తలు వింటారు. అనవసర వ్యయప్రయాసలు, ఆందోళన. వృథా ప్రయాణాలు అధికం. నిరుద్యోగులకు ఉద్యో గావకాశాలు. స్త్రీల మూలకంగా ధనలాభం. పిల్లలు చదువుల్లో పురోగతి.

కర్కాటకం (Cancer) : ఈ రాశి వారికీ వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి. కొత్త‌ కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక లాభాలు అధికం. క్రీడాకారులు, రాజకీయాల్లోని వారికి మానసిక ఆందోళన. ఆకస్మిక ధన నష్టం అవకాశం. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాల‌ నుంచి ఆశించిన శుభవార్తలు. ఇత‌రుల మాట‌లతో పక్కదోవ.

సింహం (Leo) : వీరికి బంధువుల వల్ల డబ్బు నష్టం. ఇతరులకు హానితలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. ఇత‌రుల‌ను గుడ్డిగా నమ్మొద్దు. నూతన కార్యాలకు ఆటంకాలు. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. మాట కఠినం వల్ల ఇబ్బందులు. ఆర్థిక వ్యవహారాల్లో సకాలంలో స్పందించాలి. ప్రయాణాల వల్ల లాభాలు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు.

కన్య (Virgo) : వీరికి వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం. రుణబాధలు పోతాయి. ఉద్యోగంలో ఆదరాభిమానాలు. సమాజంలో మంచి పేరు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. దైవ కార్యాలపై అధిక‌ ఖర్చు. సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూలం. ఆహార, విహారాల్లో జాగ్రత్త అవ‌స‌రం. ఆస్తి వ్యవహారం కొలిక్కి.

తుల (Libra) : వీరికి ఈ రోజు మెరుగ్గా ఆర్థిక పరిస్థితి. ఆత్మీయుల సహకారం ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. విదేశాల్లో ఉన్న వారి నుంచి శుభ వార్తలు. అనారోగ్యంతో బలహీన‌త. అధికార భయం ఉంటుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు. కుటుంబంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలాసాల మీద అధిక ఖర్చు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు.

వృశ్చికం (Scorpio) : వీరికి వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు.ఉద్యోగంలో ఆశించిన భద్రత, స్థిరత్వం. సూక్ష్మబుద్ధితో విజయాయాలు. శతృబాధలు ఉండ‌వు. ఆకస్మిక లాభాలు. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి. ఆదాయ, ఆరోగ్య స‌మ‌స్య‌లు అంత‌గా ఉండ‌వు.

ధనుస్సు (Sagittarius) : వీరికి ఈ రోజు గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యాలు వాయిదా వేసువాలి. అనుకోకుండా కుటుంబంలో కలహాలు. అశుభవార్తలు వింటారు. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆకస్మిక ధననష్టం. ధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసమేతంగా ఆలయాల సందర్శణ‌. సజావుగా వృత్తి, ఉద్యోగాలు. లాభదాయకంగా వ్యాపారాలు.

మకరం (Capricorn) : వీరికి ఈ రోజు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ కలహాలు తొలుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరితో స్నేహంగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. వృథా ప్రయాణాలు. స్వల్పంగా ఆర్థిక ఇబ్బందులు. వృత్తి జీవితంలో డిమాండ్. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. కుటుంబం సభ్యుల నుంచి ఒత్తిడి. ఉద్యోగంలో ప్రాధాన్యం.

కుంభం (Aquarius) : ఈ రోజు వీరు ఖర్చుల విషయంలో ఆలోచించాలి. గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు. వృధా ప్రయాణాలు ఎక్కువగా. మానసిక ఆందోళన. బంధుమిత్రులతో వైరం ఏఅవ‌కాశం. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలం. శారీరకంగా బలహీనం అవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పెండింగ్ పనులు పూర్తి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం. ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు, బాధ్యతలు.

మీనం (Pisces) : ఈ రోజు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. కుటుంబ విషయాల్లో అనాసక్తి. స్త్రీలకు విశ్రాంతి అవసరం. తోబుట్టువులతో సఖ్యత వ‌స్తుంది. తోటివారితో విరోధం అవ‌కాశం. వ్యాపార వ‌ళ్ల‌ ధననష్టం. వృధా ప్రయాణాలు అధికం. సాఫీగా ఉద్యోగ జీవితం. కుటుంబంలో ఒకరి ఆరోగ్యంతో ఆందోళన. ఆదాయం, ఆరోగ్యాలు అనుకూలం. వ్యాపారాలు బిజీగా ఉంటాయి.