Rasi Phalalu: మార్చి7, శుక్రవారం.. మీ రాశి ఫలాలు! వారికి.. వ్యక్తిగత సమస్యలు కొలిక్కి, రావలసిన డబ్బు చేతికి

  • By: sr    news    Mar 07, 2025 9:10 AM IST
Rasi Phalalu: మార్చి7, శుక్రవారం.. మీ రాశి ఫలాలు! వారికి.. వ్యక్తిగత సమస్యలు కొలిక్కి, రావలసిన డబ్బు చేతికి

Rasi Phalalu| Horoscope

జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి నమ్మకం ఉంది. లేచిన ద‌గ్గ‌రి నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ప్ర‌తీ రోజూ మ‌న రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. రాశి ఫ‌లాల ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెతికేది ఆ రోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల మీద ఈ రోజు సోమ‌వారం, మార్చి3 న‌ మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం

వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతృప్తికరంగా ఆదాయం. పెండింగ్ పనులన్నీ తేలికగా పూర్తి. ప్రయత్న కార్యాల్లో విజయం. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఆకస్మిక ధనలాభం. కుటుంబంతో కాలక్షేపం. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ. అనారోగ్య సమస్యల నుంచి ఉపశ మనం. ముఖ్యమైన పనులు పూర్తి. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం. నిరుద్యోగులకు శుభవార్తలు.

వృషభం

నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి. విదేశీయాన ప్రయత్నం స‌ఫ‌లం. ముఖ్య వ్యవహారాలు, పనుల్లో కార్యసిద్ధి. కుటుంబ కలహాలకు అవ‌కాశం. ఇంటా బయటా అనుకూల వాతావరణం. ఆకస్మిక ధననష్టం. పిల్లల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు. ఆర్థిక పరిస్థితులు సానుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రావలసిన డబ్బు చేతికి వ‌స్తుంది.

మిథునం

రావలిసిన డబ్బు చేతికి. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం. ప్రయాణాల్లో మంచి పరిచయాలు. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి. నిరుద్యోగులకు అవకాశాలు. ఆత్మీయులను కలవడంలో విఫలం. సంతృప్తికరంగా ఆదాయం. అనవసర వ్యయప్రయాలు. వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు అధికం. స్త్రీల వ‌ళ్ల ధన లాభం. కుటుంబ వాతావరణం ప్రశాంతం. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తి.

కర్కాటకం

ఇత‌రుల చేతిలో మోసపోయే అవకాశం. ఆకస్మిక ధన నష్టం. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపా రాల్లో శ్రమకు తగ్గ ఫలం. పక్కదోవ పట్టించే మాటలు వినకూడదు. ఇంటా బయటా ఒత్తిడి. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన. ప్రయాణాల్లో ఇబ్బంది. సాఫీగా ఉద్యోగ జీవితం. నూతన కార్యాలు వాయిదా వేసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవ‌స‌రం. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.

సింహం

పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు. మనోధైర్యాన్ని కోల్పోవ‌ద్దు. నూతన కార్యాలకు ఆటంకాలు. ఇష్టమైన ఆలయాల సందర్శణ‌. కోపంతో స‌మ‌స్య‌లు. కొద్దిగా ఆరోగ్య సమస్యలు. కఠిన మాట‌ల‌ వల్ల ఇబ్బందులు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం. ఇతరులను ఇబ్బంది పెట్టే ప‌నులకు దూరంగా ఉంటారు. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు సానుకూలం. డ‌బ్బు విష‌యంలో ఎవరికీ మాట ఇవ్వొద్దు.

కన్య

వ్యక్తిగత సమస్యలు కొలిక్కి. అనుకూలంగా ఆర్థిక పరిస్థితి. సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. ఆకస్మిక ధన లాభం. ఉద్యోగులకు కొత్త అవకాశాలు రుణ బాధలు తొలుగుతాయి. మిత్రులతో విందులు, వినోదాలు. సమాజంలో మంచిపేరు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. ఆస్తి విష‌యంలో సోదరుల‌తో రాజీ. కుటుంబంతో కలిసి దైవ కార్యాలు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరం. నిరుద్యోగులకు కోరుకున్న ఆఫర్లు.

తుల

తండ్రి వైపు ఆస్తి నుంచి లాభాలు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్ట అవకాశం. తలపెట్టిన ప్రతి పనీ సకాలంలో పూర్తి. లాభసాటిగా వృత్తి, వ్యాపారాలు. ఇంటా బయటా మాటకు, చేతకు విలువ. అనుకూలంగా ఆర్థిక వ్యవహారాలు. అనారోగ్యంతో బలహీనం. అధికారుల విష‌యంలో భయం. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగ జీవితం ప్రశాంతం. అభరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు. మిక్కిలి ధైర్య సాహసాలు ఉంటాయి. ప్రతి పనిలో వ్యయ ప్రయాసలు. సూక్ష్మ బుద్ధితో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శతృబాధలు పోతాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యమైన వారిని కలుస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు. ఆకస్మిక లాభాలు. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

ధనుస్సు

పెళ్లి ప్రయత్నాలు సానుకూలం. అనుకోకుండా కుటుంబంలో కలహాలు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి. అశుభ వార్తలు ఉంటాయి. ఆస్తి వివాదంలో రాజీ మార్గం చేసుకుంటారు. ధన వ్య‌వ‌హారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విష‌యాల‌తో మనస్తాపం చెందుతారు. ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక విషయాల్లో ఎవ‌రికీ మాట ఇవ్వొద్దు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది. కుటుంబం కోసం అధిక‌ ఖర్చులు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి. మిత్రులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం.

మకరం

ఇంట్లో శుభ కార్యం. చిన్న చిన్న‌ ఆర్థిక సమస్యల నుంచి విముక్తి. ఆదాయంలో వృద్ధి. కుటుంబ కలహాల నుంచి ఉప‌శ‌మ‌నం. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి. వృథా ప్రయాణాల వల్ల ఒత్తిడి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండాలి. ముఖ్య వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. స్వల్పంగా ఆర్థిక ఇబ్బందులు. గృహ, వాహన ప్రయత్నాలు స‌ఫలం.

కుంభం

ఉచిత సహాయాలు, వాగ్దానాలకు దూరంగా ఉండాలి. గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు. సాయం పొందినవారు ముఖం చాటేస్తారు. వృధా ప్రయాణాలు అధికం. మానసిక ఆందోళనతోనే కాలం వెళ్ల‌దీస్తారు. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల. బంధుమిత్రులతో వైరం అవ‌కాశం.ఉద్యోగంలో పని భారం. శారీరకంగా బలహీనంగా ఉంటారు. మిత్రులు, బంధువుల‌తో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు.

మీనం

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు. తోటి వారితో విరోధం ఏర్పడే అవ‌కాశం. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ధననష్టం. ఉద్యోగంలో బరువు బాధ్యతలు. వృధా ప్రయాణాలు అధికం. ఆర్థిక లావాదేవీల‌కు దూరంగా ఉండాలి. కుటుంబ విషయాల్లో అనాసక్తి. స్త్రీలకు విశ్రాంతి అవసరం. ముఖ్య వ్యవహారాల్లో అనుకోని స‌మ‌స్య‌లు. చేసే ప‌నుల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.