మంత్రి పొన్నం ఆదేశాలు: భారీ వర్షాలతో అప్రమతంగా ఉండాలి

మంత్రి పొన్నం ఆదేశాలు: భారీ వర్షాలతో అప్రమతంగా ఉండాలి

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో(Hyderabad) భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ దాసరి హరిచందన, జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఆర్వీ కర్ణన్(Commissioner R.V. Karnan), హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath), మెట్రో వాటర్ వర్క్, ట్రాఫిక్ తదితర అధికారులతో సమీక్ష జరిపారు.

భారీ వర్షాల కారణంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఏస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత వారం కురిసిన వర్షాలకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని మరోసారు అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.