బలహీనవర్గాలే లక్ష్యంగా ఏ2 విజయసాయిరెడ్డి కక్షసాధింపులు -బుద్దా వెంకన్న

విధాత:విశాఖజిల్లాసహా, ఉత్తరాంధ్రలోని బలహీనవర్గాలే లక్ష్యంగా ఏ2 విజయసాయిరెడ్డి కక్షసాధింపులు, కుట్రరాజకీయాలు, దోపిడీ సాగుతున్నాయని ఉత్తరాంధ్రప్రాంత టీడీపీ ఇన్ ఛార్జ్, పార్టీ రాష్ట్రప్రధా న కార్యదర్శి బుద్దా వెంకన్న మండిపడ్డారు. మంగళవారం ఆయన తననివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్రసహా, విశాఖజిల్లాలోని ప్రతిపక్షానికి చెందిన బీసీనేతలే లక్ష్యంగా ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతోందన్నారు. మరీముఖ్యంగా యాదవ, కొప్పువెలమ, గౌడవర్గాలవారిని లక్ష్యం చేసుకొని వారిఆర్థికమూలాలు దెబ్బతీసే కుట్రలు, కక్షసాధింపులు విజయసాయి నేతృత్వంలో కొనసాగుతున్నాయన్నారు. పల్లాశ్రీనివాసరావు వైసీపీలో చేరలేదన్న అక్కసుతో […]

బలహీనవర్గాలే లక్ష్యంగా ఏ2 విజయసాయిరెడ్డి కక్షసాధింపులు -బుద్దా వెంకన్న

విధాత:విశాఖజిల్లాసహా, ఉత్తరాంధ్రలోని బలహీనవర్గాలే లక్ష్యంగా ఏ2 విజయసాయిరెడ్డి కక్షసాధింపులు, కుట్రరాజకీయాలు, దోపిడీ సాగుతున్నాయని ఉత్తరాంధ్రప్రాంత టీడీపీ ఇన్ ఛార్జ్, పార్టీ రాష్ట్రప్రధా న కార్యదర్శి బుద్దా వెంకన్న మండిపడ్డారు. మంగళవారం ఆయన తననివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్రసహా, విశాఖజిల్లాలోని ప్రతిపక్షానికి చెందిన బీసీనేతలే లక్ష్యంగా ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతోందన్నారు. మరీముఖ్యంగా యాదవ, కొప్పువెలమ, గౌడవర్గాలవారిని లక్ష్యం చేసుకొని వారిఆర్థికమూలాలు దెబ్బతీసే కుట్రలు, కక్షసాధింపులు విజయసాయి నేతృత్వంలో కొనసాగుతున్నాయన్నారు.

పల్లాశ్రీనివాసరావు వైసీపీలో చేరలేదన్న అక్కసుతో ఆయనపై, ఆయనకుటుంబంపై కక్షసాధిస్తున్నారని వెంకన్న తెలిపారు. ఎక్కడినుంచో వచ్చిన విజయసాయి విశాఖజిల్లాప్రజలను అమాయకులను చేసి, చెలరేగిపో తున్నాడన్నారు. ఇంకో ఏడాదిలో విజయసాయి రాజ్యసభ్య సభ్యత్వకాలం ముగుస్తుందని, ఆతరువాత విశాఖఎంపీగా ఆయనపోటీచేస్తే, ప్రజల్లో ఎంత ఆదరణఉందో తేలిపోతుం దన్నారు. దొంగలు, దోపిడీదారులు, కబ్జాకోరులు అంతా వైసీపీలోఉంటే, టీడీపీనేతలను, కబ్జాకోరులు అనడం విచిత్రంగా ఉందన్నారు. అవినీతి, అక్రమాల్లో వేదాంతిగా పేరుగాంచిన అవంతి శ్రీనివాసరావు ఏమీతెలియని అమాయకుడిలా నటిస్తున్నాడన్నారు.