తండ్రి హయాంలో ఆయేషా మీరా… కొడుకు హయాంలో హాజీరా… నారా లోకేష్

విధాత:ఆయేషా మీరా కేసుని తండ్రి నీరుగార్చారు.హాజీరా కేసుని కొడుకు నీరుగారుస్తున్నాడు.హాజీరాని హత్య చేసి ఏడాది అయ్యింది…జగన్ రెడ్డి ఎక్కడ?హాజీరాని అత్యంత కిరాతకంగా చంపి 365 రోజులైంది…21 రోజుల దిశ చట్టం ఎక్కడ?పొలంకి వెళ్ళొస్తానని తల్లికి చెప్పి వెళ్లిన హాజీరా ని దారుణంగా చెంపేసారు.అత్యాచారం చేసి చంపేశారని హాజీరా కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఏడాదిగా హాజిరా తల్లి తన కూతుర్ని చంపిన వారికి శిక్ష పడాలని పోరాటం చేస్తున్నారు. ఆ తల్లి బాధ మీకు పట్టదా జగన్ రెడ్డి […]

తండ్రి హయాంలో ఆయేషా మీరా… కొడుకు హయాంలో హాజీరా… నారా లోకేష్

విధాత:ఆయేషా మీరా కేసుని తండ్రి నీరుగార్చారు.హాజీరా కేసుని కొడుకు నీరుగారుస్తున్నాడు.హాజీరాని హత్య చేసి ఏడాది అయ్యింది…జగన్ రెడ్డి ఎక్కడ?హాజీరాని అత్యంత కిరాతకంగా చంపి 365 రోజులైంది…21 రోజుల దిశ చట్టం ఎక్కడ?పొలంకి వెళ్ళొస్తానని తల్లికి చెప్పి వెళ్లిన హాజీరా ని దారుణంగా చెంపేసారు.అత్యాచారం చేసి చంపేశారని హాజీరా కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఏడాదిగా హాజిరా తల్లి తన కూతుర్ని చంపిన వారికి శిక్ష పడాలని పోరాటం చేస్తున్నారు. ఆ తల్లి బాధ మీకు పట్టదా జగన్ రెడ్డి ?తాడేపల్లి కొంపలో గాడిదెలు కాస్తున్నారా?మహిళలపై ప్రతి రెండ్రోజులకో ఘటన జరుగుతున్నా సిగ్గు లేకుండా ఎలా ఉన్నారు జగన్ రెడ్డి.

స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా మహిళలు స్వేచ్చగా తిరిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు.మీ బిడ్డపై సోష‌ల్‌మీడియాలో పోస్టు పెట్టార‌ని ఇప్ప‌టికే ప‌ది మందికి పైగా అరెస్ట్ చేశారు.హాజీరా, ర‌మ్య‌, తేజ‌స్విని, స్నేహ‌ల‌త‌, వ‌ర‌ల‌క్ష్మిలు మీ కూతురిలాంటి వాళ్లు కాదా?గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని బిల్డప్ ఇచ్చారు.ఇప్పుడు జగన్ రావడం లేదు గన్ను రావడం లేదు.జగన్ ఒక బుల్లెట్ లేని గన్ అని తేలిపోయింది.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లెలు నాకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అని చెప్పడం చరిత్రలో ఎప్పుడైనా చూసామా?జగన్ రెడ్డి చెల్లి వైఎస్ సునీతా రెడ్డి నాకు ప్రాణ భయం ఉంది,రక్షణ కల్పించండి అని అడుగుతున్నారు.ఇక ఈ రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏంటి?సొంత చెల్లికే రక్షణ కల్పించలేని వాడు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తాడు?జగన్ రెడ్డి ప్యాలస్ పక్కన మహిళ పై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకూ నిందితులను పట్టుకోలేకపోయారు.

జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ ని అత్యంత కిరాతకంగా చంపేస్తే ఈ రోజు వరకూ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు.అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత,చిత్తూరు లో గాయత్రి, విజయవాడ తేజశ్వని, గాజువాక లో వరలక్ష్మి, గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూషని అత్యంత కిరాతకంగా చంపేశారు మృగాళ్లు.రాజమండ్రిలో మైనార్టీ బాలిక పై అత్యాచారయత్నం జరిగింది.బాలిక తండ్రి సత్తార్ గారు పెద్ద పోరాటం చేస్తే కానీ కేసు నమోదు చెయ్యలేదు.మొన్న గుంటూరులో రమ్యని చంపేసాడు.రోడ్ల పై కత్తులు పట్టుకొని మహిళల్ని వెంటాడుతున్నారు.కొన్ని ఘటనల్లో మా అమ్మాయికి ప్రాణ హాని ఉందని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.ఇక మహిళల పై వైకాపా నాయకుల దాడులు,వేధింపులకు లెక్కే లేదు.ఒకటి,రెండూ కాదు రెండేళ్ల పాలనలో 500 కు పైగా ఘటనలు.హోంమంత్రి మహిళల్ని హత్య చేసే హక్కెవరిచ్చారు అని అమాయకంగా అడుగుతున్నారు. ఆ మాట విన్న తరువాత నవ్వాలో,ఏడవాలో అర్ధం కాలేదు. మహిళల్ని హత్య చేసే హక్కు సీఎం జగన్ రెడ్డి ఇచ్చారమ్మా సుచెరిత.
నేను ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్నా రెండేళ్ల మీ పరిపాలనలో ఒక్క మహిళకైనా న్యాయం జరిగిందా?ఒక్క నిందితుడికైనా శిక్ష పడిందా?

దిశ చట్టం అన్నారు,21 రోజుల్లో నిందితులకు శిక్ష అన్నారు?ఇప్పటి వరకూ ఎంత మందికి శిక్ష పడిందో చెప్పే ధైర్యం ఉందా?దిశ చట్టం,దిశ యాప్ అని ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు.కేంద్రమేమో అసలు ఆ చట్టమే లేదంటుంది.విచిత్రం ఏంటంటే వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.దిశ చట్టం పై కేంద్రం వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన కూడా లేదని కేంద్రం సమాధానమిచ్చింది.మహిళల రక్షణ పట్ల వీళ్లకున్న చిత్తశుద్ధి అది.దిశ చట్టం మహిళలకు రక్షణ కల్పించలేదు కానీ జగన్ రెడ్డికి కాసులు కురిపించింది.దిశ చట్టం పేరు చెప్పి సొంత పత్రిక,ఛానల్ కి 30 కోట్లు ప్రకటనలు ఇచ్చుకున్నారు.తాడేపల్లి ప్యాలస్ గేటు బయటకి వస్తే జగన్ రెడ్డి గారికి వాస్తవాలు తెలుస్తాయి.ఆర్థిక సహాయం ప్రకటించా మీ చావు మీరు చావండి అని జగన్ రెడ్డి అంటున్నారు.అయ్యా మీ డబ్బు,లేని మీ దిశ చట్టం,మీరు చనిపోయిన హాజీరాని తిరిగి తీసుకురాగలరా?హాజీరా తల్లికి ఎం సమాధానం చెబుతారు?ఇదే కష్టం మీ ఇంట్లో వస్తే ఇలానే స్పందిస్తారా జగన్ రెడ్డి.జగన్ రెడ్డి మూర్ఖత్వం వల్లే మహిళల పై దాడులు పెరిగిపోతున్నాయి.పోలీస్ డిపార్ట్మెంట్ ని పర్సనల్ డిపార్ట్మెంట్ గా మార్చుకున్నారు.రాజారెడ్డి రాజ్యాంగం చేతిలో పెట్టి పోలీసుల్ని టీడీపీ నాయకులపైకి వదిలారు.ఏ రోజు ఏ నాయకుడ్ని అరెస్ట్ చెయ్యాలి,ఎవరిని జైలుకి పంపాలి అనే బిజీలో పోలీస్ శాఖ ఉండి శాంతి భద్రతలను గాలికొదిలేసారు.పోలీసుల వ్యవహార శైలి వల్లే నేరస్తులు రెచ్చిపోతున్నారు.ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి మహిళల రక్షణ కి ప్రత్యేక ప్రణాళిక ప్రకటించాలి.

మైనార్టీల పై వైకాపా నాయకుల వేధింపులకు లెక్కే లేదు.నంద్యాలలో అబ్దుల్ సలాం మీద దొంగతనం కేసు పెట్టి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేలా చేసారు.గుంటూరు లో అలీషా ని పోలీసులు వేధిస్తే అతను ఆ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.హాజీరా కేసుని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి,హత్య చేసిన ఎవరైనా 21 రోజుల్లో అరెస్ట్ చెయ్యాలి.హాజీరా కుటుంబానికి ప్రభుత్వం సహాయం చెయ్యాలి.