టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయడం బాధాకరం
విధాత:పొద్దుటూరు లో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయడం బాధాకరం అని స్థానిక mla రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమానికి పూనుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం అన్నారు ఏపీ బీజేపీ సహా ఇంచార్జ్ సునీల్ డియోధర్. జిల్లా కలెక్టర్ పర్మిషన్ లేకుండా కొద్దీ రోజుల క్రితం ఈ కార్యక్రమానికి భూమి పూజ చేశారు.ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు దీనిని ఆపాలని ప్రభుత్వానికి కూడా తెలిపారు,మీరు విగ్రహం పెట్టాలనుకుంటే చాలా మంది దేశానికి సేవ చేసిన […]

విధాత:పొద్దుటూరు లో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయడం బాధాకరం అని స్థానిక mla రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమానికి పూనుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం అన్నారు ఏపీ బీజేపీ సహా ఇంచార్జ్ సునీల్ డియోధర్. జిల్లా కలెక్టర్ పర్మిషన్ లేకుండా కొద్దీ రోజుల క్రితం ఈ కార్యక్రమానికి భూమి పూజ చేశారు.ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు దీనిని ఆపాలని ప్రభుత్వానికి కూడా తెలిపారు,మీరు విగ్రహం పెట్టాలనుకుంటే చాలా మంది దేశానికి సేవ చేసిన అబ్దుల్ కలాం లాంటి ముస్లిం నాయకులు ఉన్నారు కానీ అదేమీ చేయకుండా టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడంమేంటన్నారు.ఈకార్యక్రమాన్ని మాబీజేపీ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి తదితర నాయకులు అడ్డుకుంటే పోలీసులు అరెస్ట్ చేశారు,ఇప్పటికే క్రిస్టియానీటిని మీరు స్ప్రెడ్ చేస్తున్నారు.ఫండ్స్ అన్ని వాళ్ళకి మీరు ఖర్చు పెడుతున్నారు మళ్ళీ కొత్తగా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేపట్టడం సబబు కాదు వెంటనే ఈ కార్యక్రమాన్నీ నిలుపుదల చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ని కోరుతున్నాం అన్నారు.
Readmore :ప్రజలను వంచించిన వైకాపా ప్రభుత్వం