Harish Rao : ఎరువుల కోసం మళ్లీ రైతుల పాట్లు.. ఇదేనా కాంగ్రెస్ మార్పు
ఎరువుల కొరతపై కాంగ్రెస్, బీజేపీలపై హరీష్ రావు ఫైర్. రైతుల కష్టాలు, యూరియా సమస్య పరిష్కరించకపోవడంపై తీవ్ర విమర్శలు.

Harish Rao | విధాత, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కి ధర్నాలు చేసే దుస్థితి కల్పించారని..ఇదేనా కాంగ్రెస్(Congress) తెచ్చిన మార్పు అంటూ బీఆర్ఎస్(BRS) మాజీ మంత్రి టి.హరీష్ రావు(Ex-Minister Harish Rao) ప్రశ్నించారు. రైతులకు అవసరమైన యూరియా(Urea) ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అరిగోస పెడుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట(Siddipet) రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు తిరిన రైతులను చూసి ఆగిన హరీష్ రావు రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 4 రోజుల నుండి వ్యసాయ పనులు వృధా చేసుకొని రైతులు యూరియా కోసం పడిగాపులుకాస్తున్నారని తెలిపారు. ఉదయం నుండి రైతులు వచ్చి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకొనే అధికారి లేడు అని హరీష్ రావు వ్యవసాయ అధికారులపై ఫైర్ అయ్యారు. ఒక ఆధార్ కార్డుకి ఒకటే బస్తా ఇస్తామంటున్నారు. ఆధార్ కార్డు.. ఓటీపీ అంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నట్లు రైతులు హరీష్ రావు కు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల నుండి ఇక్కడికి వచ్చి ఉంటే ఒక్క లారీ.. ఒక్క బస్తా ఇస్తామని చెప్పడం బాధాకరం అంటూ హరీష్ రావు(Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఓటీపీ, ఒక్క బస్తా విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎరువులు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్, బీజేపీలకు రైతన్నల ఉసురు తగులుతుందన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచి రాష్ట్రానికి ఎరువుల కొరత తీర్చడంలో విఫలం అయ్యారని, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఎరువుల కొరతపై నోరు మెదపడం లేదని విమర్శించారు. ఎన్నికలు ఉన్నాయని బీహార్ కు ఎరువులను తరలిస్తూ తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపుతుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెపుతారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 51 సార్లు ఢిల్లీ కి పోయాడు కానీ ఎరువుల కొరత తీర్చలేదని..కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డినే సీఎం పనితీరు తిట్లు ఎక్కువ.. పని తక్కువ అన్నట్లుగా ఉందని విమర్శించారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
బీజేపీ(BJP) రైతు వ్యతిరేక ప్రభుత్వమని..నానో యూరియా వాడాలని చెప్పడంతో రైతులపై ఎకరాకు 500 రూ. అదనపు భారం వేయడమేనన్నారు. ప్రభుత్వం సబ్సిడీ నుండి తప్పించుకోడానికి కృత్రిమ ఎరువులను సృష్టిస్తుందని హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో యూరియాకు ఈ గోస లేదని.. కాంగ్రెస్ వచ్చాక నీళ్ళు లేవు, యూరియా లేదు అంటూ రైతులు వాపోతున్నారని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ ఉన్నపుడు ఎరువులు ఎట్లా వచ్చాయి..ఇప్పుడు ఎట్లా రావడం లేదని రైతులు సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నారన్నారు.
ఇవి కూడా చదవండి…
కర్రీ పఫ్ లో పాము..ఫాస్ట్ ఫుడ్ పై తస్మాత్ జాగ్రత్త
కొడుకుతో పాటు బైక్ సమాధి..కంటతడి పెట్టించే విషాద ఘటన