ఊరందరిదీ ఒకదారయితే, ఈ ముఖ్యమంత్రిది మరోదారి

పొరుగురాష్ట్రాలను చూసి నేర్చుకోడు.. అనుభవజ్ఞుడైన చంద్రబాబుని అడగడానికేమో ఎక్కడలేని ఈగో. • మార్చిలో 900 కరోనా కేసులున్నప్పుడు అసెంబ్లీ పెట్టలేదు.• ఇప్పుడేమో 2లక్షలకు పైగా కేసులుంటే అసెంబ్లీ పెడుతున్నాం.. మీరెందుకు రారు అంటున్నారు.• ఊరందరిదీ ఒకదారయితే , ఉలిపికట్టెది మరోదారి అంటారు. జగన్మోహన్ రెడ్డి తీరుకూడా అలానేఉంది.• పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసి కూడా నేర్చుకోవడంలేదు.• చంద్రబాబునాయుడి సలహాలు, సూచనలు తీసుకోవడానికేమో ఈ ముఖ్యమంత్రికి ఎక్కడలేని ఈగో ఉందాయే.• ఒక్కరోజులోనే గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ఆమోదం జరగాలి అన్న […]

ఊరందరిదీ ఒకదారయితే, ఈ ముఖ్యమంత్రిది మరోదారి

పొరుగురాష్ట్రాలను చూసి నేర్చుకోడు.. అనుభవజ్ఞుడైన చంద్రబాబుని అడగడానికేమో ఎక్కడలేని ఈగో.

• మార్చిలో 900 కరోనా కేసులున్నప్పుడు అసెంబ్లీ పెట్టలేదు.
• ఇప్పుడేమో 2లక్షలకు పైగా కేసులుంటే అసెంబ్లీ పెడుతున్నాం.. మీరెందుకు రారు అంటున్నారు.
• ఊరందరిదీ ఒకదారయితే , ఉలిపికట్టెది మరోదారి అంటారు. జగన్మోహన్ రెడ్డి తీరుకూడా అలానేఉంది.
• పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసి కూడా నేర్చుకోవడంలేదు.
• చంద్రబాబునాయుడి సలహాలు, సూచనలు తీసుకోవడానికేమో ఈ ముఖ్యమంత్రికి ఎక్కడలేని ఈగో ఉందాయే.
• ఒక్కరోజులోనే గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ఆమోదం జరగాలి అన్న తాపత్రయం తప్ప, ప్రజల బాధలగురించి ఏమైనా ఆలోచిస్తున్నారా?
• రెండోసారి వ్యాక్సిన్లు వేయించుకోవాల్సిన వారికి వ్యాక్సిన్లు ఇవ్వని ప్రభుత్వం, కరోనాతోచనిపోయినవారికి అంత్యక్రియలకు రూ.15వేలు ఇస్తుందా?
• టీడీపీ ప్రజాసమస్యలపై పోరాడాలని, ప్రభుత్వ తీరుని ఎండగట్టాలని నిర్ణయించుకుంది కాబట్టే, మాక్ అసెంబ్లీ నిర్వహిస్తోంది.

విధాత :టీడీపీకి అసెంబ్లీకి వచ్చే ఉద్దేశంలేకనే బాయ్ కాట్ చేసిందని సజ్జల చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, మార్చిలో బడ్జెట్ సమావేశాలు పెట్టడానికి ప్రభుత్వానికి కోవిడ్ అడ్డొచ్చిందని, మరిప్పుడు 2లక్షలకుపైగాయాక్టివ్ కేసులుంటే ఎలా అసెంబ్లీనిర్వహిస్తున్నారో సమాధానంచెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన జూమ్ యాప్ ద్వారా తననివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు రోజుకి 20వేలకుపైబడి కేసులు నమోదవుతున్నాయని, మార్చి లో మొత్తంగాకూడా కేవలం 900 కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. ఆరోజు అసెంబ్లీ నిర్వహణకుకరోనా అడ్డు గా ఉందన్నవారు, ఇప్పుడు తమపీఠాలు ఎక్కడ కదులుతా యోనన్నభయంతోనే మొక్కుబడిగా అసెంబ్లీనిర్వహణకు సిద్ధమయ్యారన్నారు.

ఊరందరిదీఒకదారయితే, ఉలిపికట్టెది మరోదారన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడని, మార్చిలో కేంద్రప్రభుత్వం, తెలంగాణసహా, అనేక రాష్టప్రభుత్వాలు బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే, ఈయనకు మాత్రం వీలుపడలేదని టీడీపీనేత ఎద్దేవాచేశారు. మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే, ప్రభుత్వలొసుగులన్నీ బయటపడతాయని భావించే ప్రభుత్వం అప్పుడు అసెంబ్లీ పెట్టలేదన్నారు. ఇప్పుడేమో ఒక్కరోజులోనే గవర్నర్ ప్రసం గం, బడ్జెట్ పై చర్చపెట్టి, హడావుడిగా బడ్జెట్ ఆమోదింపచే సుకోవాలనే తాపత్రయంలో ప్రభుత్వముందన్నారు.

అంతే గానీ ప్రజల ఆరోగ్యంపై, వారుఎదుర్కొంటున్న ఇతర సమస్య లపై చర్చించడానికి ఈ ప్రభుత్వం అసెంబ్లీని నిర్వహించడం లేదని శ్రీనివాసులు తేల్చిచెప్పారు. తమిళనాడు ముఖ్యమం త్రి కరోనానుంచి తనరాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతిపక్ష సభ్యులతో కమిటీవేస్తే, ఈ ముఖ్యమంత్రి మాత్రం ప్రతిపక్షా న్ని తొక్కిపెట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడన్నారు. తన ఈగో మనస్తత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సలహాలుకూడా అడగలేకపోతున్నాడన్నారు. కేరళ, తమిళ నాడుప్రభుత్వాలు పేదకుటుంబాలకు డబ్బులు, నిత్యావసర రాలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయన్నారు. ఈ ప్రభుత్వ తీరుకి నిరసనగానే తాము మాక్ అసెంబ్లీ నిర్వ హణకు సిధ్దమయ్యామని ఎమ్మెల్సీ చెప్పారు. కరోనాతో చని పోయినవారికి ప్రభుత్వం రూ.15వేలిస్తామని చెబుతోందని, అందుకోసం మరణాల సంఖ్యను తక్కువచేసి చూపుతోంద న్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియలో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తొలిదశ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి రెండోసారి వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయాయ న్నారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు కేవలం రూ.45కోట్లు కేటాయించడం, చంద్రబాబునాయుడు వ్యాక్సిన్లు తెప్పిస్తాడ నడం వంటివి ఈ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నా రు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా లేరుకాబట్టే రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి వచ్చిందనే అభిప్రాయంలో ప్రజలంతా ఉన్నారన్నారు. ప్రభుత్వతీరుని నిరసిస్తూ, కరోనా పైనే మాక్ అసెంబ్లీలోప్రధానంగా చర్చించాలని తామునిర్ణ యం తీసుకోవడంజరిగిందన్నారు.

కరోనాను ఎదుర్కోవడం లో, రైతులసమస్యలనుపరిష్కరించడంలో ఈ ప్రభుత్వం ఎం త ఘోరంగా విఫలమైందో టీడీపీ మాక్ అసెంబ్లీ ద్వారా ఎండ గడుతుందన్నారు. కరోనాపై నోరుతెరవలేని దుస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉండటం బాధాకరమని శ్రీనివాసులు వాపోయారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోం దని, సజ్జలవంటివారు నిస్సిగ్గుగా తమచర్యలను సమర్థిం చుకుంటున్నారని టీడీపీనేత మండిపడ్డారు. జగనన్న జలకళ పథకం కింద రాష్ట్రంలో ఎన్ని బోర్లు వేశారో ప్రభుత్వం సమాధానంచెప్పాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు.