ఎంపీ శ్రీనివాస్‌తో ఈటల రాజేందర్ భేటీ
విధాత(హైదరాబాద్): రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా డీఎస్‌తో ఈటల చర్చలు జరిపారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల వెల్లడించారు. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. భేటీ ముగిసిన సమయంలో అక్కడికి వచ్చిన డీఎస్ తనయుడు బీజేపీ ఎంపీ అరవింద్ను కూడా ఈటల కలిసి మాట్లాడారు.

విధాత(హైదరాబాద్): రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా డీఎస్‌తో ఈటల చర్చలు జరిపారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల వెల్లడించారు.
తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. భేటీ ముగిసిన సమయంలో అక్కడికి వచ్చిన డీఎస్ తనయుడు బీజేపీ ఎంపీ అరవింద్ను కూడా ఈటల కలిసి మాట్లాడారు.