మనల్ని ఓడించి బొందల పడ్డామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు: కేసీఆర్
ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ పాలన తెచ్చుకుని బొందల పడ్డామని ఆవేదన చెందుతున్నారని కేసీఆర్ అన్నారు. త్వరలో కొత్త పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి..కాంగ్రెస్ పాలన తెచ్చుకుని బొందల పడ్డట్టుగా ఆవేదన చెందుతున్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరోసారి ఆయన ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి తప్పుచేశారంటు తన పాత మాటలను పునరుద్ఘాటించారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి హాజరైన కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని, ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావడం లేదు అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని, బొందల పడ్డట్టయ్యిందని తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని చెప్పుకొచ్చారు. ఇదో చిల్లర ప్రభుత్వం..ఆ మాటలు ఏంటీ.. ఆ కూతలు ఏంటీ అని అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటును తప్పుబడుతూ మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఓ వేధవ అని కేసీఆర్ మండిపడ్డారు. తేజస్వీ వాఖ్యలపై రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ స్పందించలేదు అని, కాళేశ్వరంపై సీఆర్. పాటిల్ చేసిన వ్యాఖ్యలను రాజ్యసభలో మా ఎంపీ సురేష్ రెడ్డి ఒక్కరే ఖండించారు అని కేసీఆర్ గుర్తు చేశారు.
చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం అని, మిత్రుడు అశోక్ గులాటి సలహాతోనే రైతు బంధు పథకం తీసుకొచ్చానని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇప్పుడు దిగజారిపోయిందని కేసీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎష్ జిల్లా, రాష్ట్ర కమిటీలను రద్దు చేస్తున్నామని, త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో 200మందికి శిక్షణ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని, కేడర్ ను పటిష్టం చేయాలని అన్నారు.
ఇవి కూడా చదవండి :
కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రగతి మార్గాలు..హై స్పీడ్ రైల్వే కారిడార్లు: మంత్రి వెంకట్ రెడ్డి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram