నా రాజకీయ చరిత్రో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు.. ఎమ్మెల్యే ఆళ్ళ
విధాత :నామీద అవినీతి అక్రమాలు వెలువడ్డాయి అనే విషయాన్ని నేను మీడియా ద్వారా తెలుసుకున్నాను.నా రాజకీయ చరిత్రో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు.టీడీపీ నాయకులు గ్రహించాలి. 2006 లో నేను రాంకీ సంస్థలో ఉద్యోగం చేసాను.2006 నుండి 2021 వరకు రాంకీ గ్రూప్ లో ఏ విధమైన షేర్లు నాకు లేవు. అది రాంకీ గ్రూప్ సంస్థ లో జరిగిన ఐటీ దాడుల్లో రుజువు అయ్యింది.స్థానికం గా ఉన్న టీడీపీ నాయకులు అన్ని విషయాలు తెలుసుకుని […]

విధాత :నామీద అవినీతి అక్రమాలు వెలువడ్డాయి అనే విషయాన్ని నేను మీడియా ద్వారా తెలుసుకున్నాను.నా రాజకీయ చరిత్రో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు.టీడీపీ నాయకులు గ్రహించాలి. 2006 లో నేను రాంకీ సంస్థలో ఉద్యోగం చేసాను.2006 నుండి 2021 వరకు రాంకీ గ్రూప్ లో ఏ విధమైన షేర్లు నాకు లేవు. అది రాంకీ గ్రూప్ సంస్థ లో జరిగిన ఐటీ దాడుల్లో రుజువు అయ్యింది.స్థానికం గా ఉన్న టీడీపీ నాయకులు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. ఒక కంపెనీ, షేర్లు, మూలధనం అంటే ఏమిటో అవి ముందు టీడీపీ నాయకులు తెలుసుకోవాలి.దుగ్గిరాల మండలం లో ఇళ్ల స్థలాలు విషయం లో అవినీతి జరిగింది అన్న మాట అవాస్తవం.
టీడీపీ నాయకులు దీన్ని బూచిగా చూపడం కరెక్ట్ కాదు.లోకేష్ పై నేను ఆరువేల ఓట్ల మెజార్టీ తో గెలిచాను నాకు స్థానిక ప్రజలు అంతటి విజయాన్ని చేకూర్చారు. స్థానిక టీడీపీ నాయకులు ఇది తెలుసుకోవాలి. చంద్రబాబు తమ పార్టీ నాయకులకు పార్టీ ని ఎలా డవలెప్ చేసుకోవాలో అనే విషయం ఇక పార్టీ వ్యక్తులకు ప్రవేట్ నిర్వహించుకోవాలి.కంపెనీ, షేర్లు, మూలధనం అంటే ఏమిటో ముందు స్థానిక టీడీపీ నాయకులు తెలుసుకోవాలి. ఈ విషయాలపై ఒక అవగాహనతో మాట్లాడాలి.మేము ఎక్కడా కావాలని పేదల ఇళ్ళు కూల్చలేదు. స్వతహాగా వారి గృహాలలో వారికి పనికి వచ్చే వస్తువులు తీసుకెళ్లాక మొండి గోడలను మాత్రమే మేము జేసీబీ లతో కూల్చడం జరిగింది. ఇది గ్రహించలేని స్థానిక టీడీపీ నాయకులు నానా గందరగోళం సృష్టించారు.కోటి జన్మలు ఎత్తిన టీడీపీ కి మంగళగిరి నియోజక వర్గం లో విజయం సాధ్య పడదు.పుష్కరాల పేరుతో తాడేపల్లి లో 2000 నివాసాలను టీడీపీ ప్రభుత్వం తొలగించింది. వారికి ఈ రోజు వరకు ఎటువంటి న్యాయం చేయలేదు చంద్రబాబు.