పెంపుల‌న్నీ జ‌గ‌న్ నాట‌కం -నారా లోకేష్

విధాత;ఉద్యోగుల సంక్షేమం కోసం అంటూ జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌క‌టించిన జీతాలు,వేత‌నాల పెంపులో అంతా అవాస్త‌వాలేన‌ని నారా లోకేష్ మండిప‌డ్డారు.అంగన్వాడీల జీతం 7100 నుండి 10500 కి పెంచింది తెలుగుదేశం ప్ర‌భుత్వం అయితే జ‌గ‌న్ రెడ్డి దీనికి ఓ 500 క‌లిపి త‌న ఖాతాలో వేసుకున్నార‌ని ఆరోపించారు.హోమ్ గార్డ్స్ జీతం 9000 నుండి 18000 కి పెంచింది టిడిపి హ‌యాంలోనే అని పేర్కొన్నారు. వీఆర్ఏల‌ జీతం 6000 నుండి10500కి పెంచింది 2014-19లో ప్ర‌భుత్వం కాదా అని నిల‌దీశారు. RTC ఉద్యోగులకు, […]

పెంపుల‌న్నీ జ‌గ‌న్ నాట‌కం -నారా లోకేష్

విధాత;ఉద్యోగుల సంక్షేమం కోసం అంటూ జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌క‌టించిన జీతాలు,వేత‌నాల పెంపులో అంతా అవాస్త‌వాలేన‌ని నారా లోకేష్ మండిప‌డ్డారు.అంగన్వాడీల జీతం 7100 నుండి 10500 కి పెంచింది తెలుగుదేశం ప్ర‌భుత్వం అయితే జ‌గ‌న్ రెడ్డి దీనికి ఓ 500 క‌లిపి త‌న ఖాతాలో వేసుకున్నార‌ని ఆరోపించారు.హోమ్ గార్డ్స్ జీతం 9000 నుండి 18000 కి పెంచింది టిడిపి హ‌యాంలోనే అని పేర్కొన్నారు. వీఆర్ఏల‌ జీతం 6000 నుండి10500కి పెంచింది 2014-19లో ప్ర‌భుత్వం కాదా అని నిల‌దీశారు. RTC ఉద్యోగులకు, AP NGO ల కు 43% ఫిట్మెంట్ ప్ర‌క‌టించిన ఘ‌న‌త టిడిపిదేన‌న్నారు.పోలీసుల‌కు వీక్లీ ఆఫ్‌లు ఇచ్చామ‌ని ఘ‌నంగా ప్ర‌క‌టించిన సంగ‌తి దిశ‌చ‌ట్టం పాలాభిషేకంలాంటిదేన‌ని ఎద్దేవ చేశారు.

పోలీసుల్ని వైకాపా కార్య‌క‌ర్త‌ల కంటే ఘోరంగా వాడుకుంటూ ప్ర‌తిప‌క్షంపై క‌క్ష‌సాధింపుల‌కు వారిని వినియోగిస్తున్న జ‌గ‌న్‌రెడ్డి వ‌ల్ల‌ ఏ ఒక్క పోలీసు అయినా వీక్లీ ఆఫ్ తీసుకున్న‌వారున్నారా అని లోకేష్ ప్ర‌శ్నించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో 104 డ్రైవ‌ర్లకి జీతం ఇవ్వ‌కుండా ప‌నిచేయించుకున్న‌ట్టు, జ‌గ‌న్‌రెడ్డి త‌న ఇంట్లోంచి సొమ్ము తెచ్చి నెల‌కి 26 వేలు ఇస్తున్న‌ట్టు కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నంతో యాడ్స్ ఇవ్వ‌డానికి క‌నీసం సిగ్గుప‌డ‌ని ప్ర‌భుత్వం తీరు అంతా జ‌గ‌న్ నాట‌కంగా మారింద‌ని విమ‌ర్శించారు.

నిజంగా ఉద్యోగులకు మేలు చేసిన‌వాడైతే కోట్ల రూపాయ‌లు యాడ్స్ ఇచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. అధికారంలోకొచ్చిన ఏడు రోజుల్లోగా సీపీఎస్ ర‌ద్దు చేస్తాన‌ని ఫేక్ హామీనిచ్చి సీఎం గ‌ద్దెనెక్కిన జ‌గ‌న్‌రెడ్డి 700 రోజులు దాటినా సీపీఎస్ ర‌ద్దు ఊసేలేక‌పోవడం దారుణం.డిఏ,పిఆర్సీ గురించి కనీసం ప్రస్తావన లేకపోవడం ఉద్యోగుల ప‌ట్ల‌, వారి సంక్షేమం ప‌ట్ల వైసీపీ స‌ర్కారు చూపిస్తున్న‌ది స‌వ‌తిత‌ల్లి ప్రేమ అని తేట‌తెల్ల‌మైంద‌న్నారు.

వైసీపీకి దొంగ ఓట్లేయించే వైసీపీ కార్య‌క‌ర్త‌ల్ని వాలంటీర్లుగా వేసుకోవ‌డం వివ‌క్ష లేక‌పోవ‌డ‌మా? వార్డు, గ్రామ‌స‌చివాల‌య ఉద్యోగ భ‌ర్తీ ప‌రీక్ష పేప‌రు అమ్మేయ‌డం అవినీతికి తావులేకుండా భ‌ర్తీ చేసిన‌ట్టా? ఉద్యోగాలు అమ్ముకోవ‌డం మీ భాష‌లో అత్యంత పార‌ద‌ర్శ‌క‌తా? జే గ్యాంగ్ ప్రాణాంత‌క మ‌ద్యం బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడ‌ల్ అమ్మే ఉద్యోగాలూ గౌర‌వ‌నీయ‌మైన ప్ర‌భుత్వ ఉద్యోగాలా? అని జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని నారా లోకేష్ నిల‌దీశారు.