కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి అనూప్‌ చంద్ర

విధాత‌:న్యూఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి అనూప్‌ చంద్ర పాండే బాధ్యతలు స్వీకరించారు. 1984 బ్యాచ్‌ ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆయన గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో అనూప్‌ పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పనిచేసిన సునీల్‌ అరోడా ఏప్రిల్‌ 12 న పదవీ విరమణ చేసిన నాటి నుంచి, ముగ్గురు సభ్యుల కమిషన్‌లో ఒక […]

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి అనూప్‌ చంద్ర

విధాత‌:న్యూఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి అనూప్‌ చంద్ర పాండే బాధ్యతలు స్వీకరించారు.

1984 బ్యాచ్‌ ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆయన గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో అనూప్‌ పనిచేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పనిచేసిన సునీల్‌ అరోడా ఏప్రిల్‌ 12 న పదవీ విరమణ చేసిన నాటి నుంచి, ముగ్గురు సభ్యుల కమిషన్‌లో ఒక కమిషనర్​ పదవి ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈ స్థానాన్ని అనూప్‌ చంద్ర పాండేతో భర్తీ చేసింది కేంద్రం.