వైసీపీది దొంగ ఓట్ల, దొంగ నోట్ల విజయం
ఇది జగన్ రెడ్డి సంక్షేమ పథకాల విజయం కాదు ప్రవేటు బస్సుల విజయం ఎన్నికల్లో వైసీపీ గెలిచినా నైతికంగా టీడీపినే గెలిచిందని ప్రజలే అంటున్నారు-కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్యాత్మికతకు నిలయమైన తిరుపతిలో వైసీపీ నేతలు ఉప ఎన్నికల్లో ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. దొంగ కంపెనీలు పెట్టి వేల కోట్లు దోచినట్లు దొంగ ఓట్లు వేసి తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. కానీ ప్రజలు మాత్రం నైతికంగా టీడీపీనే గెలిచిందటున్నారు. జగన్ రెడ్డి, […]

ఇది జగన్ రెడ్డి సంక్షేమ పథకాల విజయం కాదు ప్రవేటు బస్సుల విజయం
ఎన్నికల్లో వైసీపీ గెలిచినా నైతికంగా టీడీపినే గెలిచిందని ప్రజలే అంటున్నారు-కింజరాపు అచ్చెన్నాయుడు
ఆధ్యాత్మికతకు నిలయమైన తిరుపతిలో వైసీపీ నేతలు ఉప ఎన్నికల్లో ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. దొంగ కంపెనీలు పెట్టి వేల కోట్లు దోచినట్లు దొంగ ఓట్లు వేసి తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. కానీ ప్రజలు మాత్రం నైతికంగా టీడీపీనే గెలిచిందటున్నారు.
జగన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి చేయించిన దొంగ ఓట్ల దందానే వైసీపీ విజయానికి కారణం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, నిజమైన ఓటర్ల హక్కును కాలరాసి తెచ్చుకున్నది విజయమే కాదు. అన్యాయాన్ని తిరుపతి వీధుల్లో నడిపించిన ఘనత వైసీపీది. నైతికంగా గెలిచామన్న సంతోషం వైసీపీ నేతల మొహాల్లోనే కనబడటం లేదు.
వైసీపీ చేసే ప్రతి అరాచకం, దుర్మార్గాలకు బుద్ధి చెప్పడానికి ఒక రోజు రాసి పెట్టి వుంది. ఆ రోజున వైసీపీ నేతలు మొత్తం బాధపడే స్థితి వస్తుంది. వైసీపీ దురాగతాలను దగ్గరుండి చూపించిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల తెగువను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉపఎన్నికల్లో వైసీపీ సృష్టించిన ఫేక్ ఓటర్ కార్డులను అడ్డుకోకుండా పోలింగ్ అధికారులు పూర్తిగా సహకరించారు.
దాన్ని అడ్డుకున్న మా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వైసీపీ గెలుపులోభాగస్వామ్యమయ్యారు. వైసీపీ నేతల మదాన్ని తిరుపతి ప్రజలు అణిచారు. దొంగ ఓట్లకు పాల్పడలేదని తిరుపతి వెంకన్న సాక్షిగా వైసీపీ నేతలు బహిరంగ ప్రమాణానికి రావాలి. దొంగ ఓట్లు వేసినట్లు స్పష్టమైన ఆధారాలు చూపించినా సీఈసీ స్పందించకపోవడం దారుణం.