Ind vs NZ|మూడో టెస్ట్‌లోను టీమిండియా విజ‌యం సాధించ‌డం క‌ష్ట‌మే.. రికార్డులు అలా ఉన్నాయి..!

Ind vs NZ|సొంత గ‌డ్డ‌పై టీమిండియా దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండు టెస్ట్‌ల‌లో భార‌త్ దారుణ‌మైన ఓట‌మిని చ‌వి చూసింది. కొన్నాళ్లుగా స్వ‌దేశంలో అత్య‌ద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న టీమిండియాని ఓడించ‌డం ఏ జ‌ట్టు

  • By: sn    sports    Oct 30, 2024 10:59 AM IST
Ind vs NZ|మూడో టెస్ట్‌లోను టీమిండియా విజ‌యం సాధించ‌డం క‌ష్ట‌మే.. రికార్డులు అలా ఉన్నాయి..!

Ind vs NZ|సొంత గ‌డ్డ‌పై టీమిండియా(India) దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండు టెస్ట్‌ల‌లో భార‌త్ దారుణ‌మైన ఓట‌మిని చ‌వి చూసింది. కొన్నాళ్లుగా స్వ‌దేశంలో అత్య‌ద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న టీమిండియాని ఓడించ‌డం ఏ జ‌ట్టు వ‌ల్ల కాలేదు. కాని న్యూజిలాండ్ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అయితే బెంగళూరులో, ఆ తర్వాత పుణెలో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించ‌గా , ఇప్పుడు ముంబైలో కూడా ఓడించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాల‌ని భావిస్తుంది. మ‌రోవైపు టీమిండియా చివ‌రి టెస్ట్ అయిన గెలిచి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌నే త‌హ‌త‌హ‌లాడుతుంది.

టెస్టు సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా సిరీస్‌కి ఉత్సాహం అందిపుచ్చుకోవాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఈ మ్యాచ్ గెల‌వాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. అయితే న్యూజిలాండ్(New Zealand) క‌నుక మూడో మ్యాచ్ గెలిస్తే మాత్రం భారత్‌కు వచ్చి టీమిండియాను క్లీన్‌స్వీప్ చేసిన రెండవ జట్టుగా అవతరిస్తుంది. అదే సమయంలో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు గెలిచిన మొదటి జట్టుగా కూడా అవతరిస్తుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడో మ్యాచ్ కూడా ఓడిపోతే దారుణంగా తిట్టిపోయ‌డం ఖాయం.

అయితే వాంఖ‌డేలో మూడో టెస్ట్ మ్యాచ్ ఆడ‌నుండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్టేడియంలో టీమిండియా మొత్తం 26 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, అందులో 12 మాత్రమే గెలిచింది. అంటే సగం కంటే తక్కువ మ్యాచ్‌లు గెలిచాయి. టీమిండియా 7 సార్లు ఓడిపోయింది. అంటే, భారత్ ఆడిన మ్యాచ్‌లలో 30 శాతం. మిగిలిన 7 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 3 సంవత్సరాల క్రితం 2021లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జ‌రిగింది. ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలిచింది.కాని ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్(Azaj patel) మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. ఇదే మైదానంలో 36 ఏళ్ల క్రితం 1988లో టీమిండియాపై చివరి విజయాన్ని నమోదు చేసింది న్యూజిలాండ్ . ఈ మైదానంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 3 టెస్టులు జరిగాయి. ఇందులో 2 భారత్, 1 న్యూజిలాండ్ పేరుతో ఉన్నాయి.మరి ఈ గ్రౌండ్‌లో విజేత‌లుగా నిలుస్తారో చూడాలి.