KKR Mustafizur removal| ఐపీఎల్ నుంచి బంగ్లా ఆటగాడిని తప్పించండి : బీసీసీఐ
బంగ్లాదేశ్ లో హిందువులపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ టోర్నీలో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ఆడనున్న బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ ఆ ప్రాంచైజీ యజమాన్యాన్ని ఆదేశించింది. బీసీసీఐ ఆదేశాలతో కోల్ కత్తా నైట్ రైడర్స్ యజమాన్యం ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ జట్టు నుంచి విడుదల చేసినట్లుగా ప్రకటించింది.
విధాత : బంగ్లాదేశ్ లో హిందువులపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ టోర్నీలో కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR)కు ఆడనున్న బంగ్లాదేశ్ )Bangladesh)ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman)ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ ఆ ప్రాంచైజీ యజమాన్యాన్ని ఆదేశించింది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ కు తీసుకున్న బీసీసీఐపైన, కోల్ కత్తా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ పైన విమర్శలు చెలరేగాయి. దీంతో ముస్తాఫిజుర్ రెహమాన్ నుంచి ఐపీఎల్ జట్టు నుంచి తొలగించాలని, అతని స్థానంతో మరో ఆటగాడిని ఎంపిక చేసుకోవచ్చని ఆదేశాలిచ్చినట్లుగా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. బీసీసీఐ ఆదేశాలతో కోల్ కత్తా నైట్ రైడర్స్ యజమాన్యం ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ జట్టు నుంచి విడుదల చేసినట్లుగా ప్రకటించింది.
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో రికార్డు ధర రూ.9.2 కోట్లకు ముస్తాఫిజుర్ రెహమాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకోవడంపై విమర్శలు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువుల మీద వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో బంగ్లా ఆటగాళ్లను ఐపీఎల్ లోకి తీసుకోవడాన్ని ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లను ఐపీఎల్ లోకి తీసుకోనప్పుడు బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఎందుకు తీసుకుంటున్నారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. బంగ్లాలో మూడు వారాల వ్యవధిలో నలుగురు హిందువులను దారుణంగా హతమార్చిన ఘటన నేపథ్యంలో ఈ విమర్శలు మరింత పెరిగాయి. దీంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
క్రీడలకు రాజకీయాలు ముడిపెట్టడం సరికాదు : ఎంపీ శశిథరూర్
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 కోల్ కత్తా నైట్ రైడర్స్ నుంచి తప్పించడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుబట్టారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులకు, క్రికెట్‌కు ముడిపెట్టకూడదన్నారు. ఆ దేశంలో మైనార్టీలపై దాడులు ఆగేలా చర్యలు తీసుకోవాలని మేం అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని..అదే సమయంలో ఆ దాడులతో క్రీడలను ముడిపెట్టడం కూడా సరైంది కాదని.. ముస్తాఫిజుర్ రెహమాన్ ను క్రీడాకారుడిగానే చూడాలని శశిథరూర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే సైతం బీసీసీఐ చర్యను తప్పుబట్టారు. పహల్గాం దాడి తర్వాత.. భారత్, పాక్‌తో మ్యాచ్‌లు ఆడితే బీజేపీ అభ్యంతరం తెలపలేదు అని.. కొవిడ్ సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లను ఇస్లామిక్ దేశాలకు తరలిస్తే అప్పుడూ ప్రశ్నించలేదు అని గుర్తు చూశారు. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీలను ప్రశ్నించే బదులు.. బీజేపీ నాయకులు వారి హోమ్ మినిస్టర్‌ను ప్రశ్నిస్తే మంచిదని ప్రియాంక్ ఖర్గే ఎక్స్ వేదికగా సూచించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram