DC vs RR| ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం..గెలిచే మ్యాచ్‌లో ఓడిన ఆర్ఆర్ టీం

DC vs RR| ఐపీఎల్ 2024లో భాగంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ న‌డిచింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సి ఉండ‌గా,

  • By: sn    sports    May 08, 2024 6:33 AM IST
DC vs RR| ఢిల్లీ  ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం..గెలిచే మ్యాచ్‌లో ఓడిన ఆర్ఆర్ టీం

DC vs RR| ఐపీఎల్ 2024లో భాగంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ న‌డిచింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సి ఉండ‌గా, అంద‌రు క‌లిసిక‌ట్టుగా ఆడ‌డంతో రాజస్థాన్ రాయల్స్ పై 20 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది. అయితే కీలక సమయంలో షై హోప్ సంచలన క్యాచ్‌తో సంజూ శాంసన్ ఔటవ్వడం రాజస్తాన్ రాయల్స్ విజయవకాశాలను దెబ్బతీసింది అని చెప్పాలి. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసింది.

మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేశారు. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (20 బంతుల్లో 50 పరుగులు; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శకతంతో అద‌రగొట్ట‌గా.. అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 65 పరుగులు; 7ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ఈ ఇద్ద‌రు సులువుగా ప‌రుగులు రాబ‌ట్ట‌డ‌తో ఢిల్లీకి మంచి స్కోరు ద‌క్కింది. మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ శాయ్ హోప్ (1), కెప్టెన్ రిషబ్ పంత్ (15), అక్షర్ పటేల్ (15) పెద్ద‌గా ప‌రుగులు చేయలేకపోయారు. అయితే, చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41 పరుగులు; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించ‌డంతో ఢిల్లీకి భారీ స్కోరు దక్కింది. రాజస్థాన్ బౌలర్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (3/24) అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయగా, యుజువేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.

222 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ చ‌తికిల ప‌డింది. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే యశస్వి జైస్వాల్(4) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ బాట ప‌ట్టాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌తో కలిసి జోస్ బట్లర్ ప‌రుగుల వ‌ర‌ద పారించారు. ఈ ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు వేగం పెరిగింది. 46 బంతుల్లోనే 86 పరుగులతో సంజూ అదరగొట్టాడు. 8 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదాడు. అయితే, 16వ ఓవర్లో కీలక సమయంలో సంజూ శాంసన్ ఔటయ్యాడు. ఇక జాస్ బట్లర్ (19) , రియాన్ పరాగ్ (22) విఫ‌లం కావ‌డంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓట‌మిఖాయ‌మైంది.ఇక ఢిల్లీ ప్ర‌స్తుతం 12 పాయింట్ల‌ని ద‌క్కించుకుంది. ఇంకో రెండు మ్యాచ్‌లు ఉండ‌గా, అవి కూడా మంచి నెట్ ర‌న్‌రేట్‌తో గెలిస్తే ప్లే అవ‌కాశాలు ఉంటాయి. ఆర్ఆర్ విష‌యానికి వ‌స్తే ఇంకో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండ‌గా, అందులో ఒక్క‌టి గెలిచిన చాలు