Hardik Pandya| హార్ధిక్ పాండ్యాకి దెబ్బ మీద దెబ్బ‌..ఇప్పుడు భార్య కూడా విడాకులు ఇచ్చేసిందా?

Hardik Pandya| టీమిండియా స్టార్ ఆటగాడు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇటీవ‌ల త‌ర‌చు విమ‌ర్శ‌ల బారిన ప‌డుతున్నాడు. ఒక‌ప్పుడు చాలా సంతోషంగా ఉండే పాండ్యా ఎప్పుడైతే ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ అయ్యాడో అప్ప‌టి నుండి తెగ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రోహిత్‌ని త‌ప్పించి మ‌

  • Publish Date - May 24, 2024 / 06:45 AM IST

Hardik Pandya| టీమిండియా స్టార్ ఆటగాడు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇటీవ‌ల త‌ర‌చు విమ‌ర్శ‌ల బారిన ప‌డుతున్నాడు. ఒక‌ప్పుడు చాలా సంతోషంగా ఉండే పాండ్యా ఎప్పుడైతే ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ అయ్యాడో అప్ప‌టి నుండి తెగ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రోహిత్‌ని త‌ప్పించి మ‌రీ పాండ్యాని కెప్టెన్ చేయ‌డంపై చాలా మంది ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యారు. ఈ క్ర‌మంలో పాండ్యాని కూడా ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. మ‌రోవైపు ఈ సీజ‌న్‌లో పాండ్యా చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌, ఆక‌ట్టుకోని కెప్టెన్సీ అత‌నికి లేని పోని స‌మ‌స్య‌లు తెచ్చిపెట్టాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా‌కు తన భార్య నటాషా విడాకులు ఇవ్వబోతుందంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

హార్దిక్-నటాషా 2020లో పెళ్లి చేసుకున్నారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఉన్నట్లుండి వీరి రిలేషన్ షిప్ పై ఒక్కసారిగా రూమర్స్ వినిపిస్తున్నాయి. హార్దిక్ పుట్టిన రోజు సందర్భంగా నటాషా ఎలాంటి పోస్ట్ , విషెష్ కానీ చెప్పలేదు. దీంతో వీరి రిలేషన్‌లో చీలిక వచ్చిందని జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. నటాషా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పాండ్యాతో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేయ‌డం లేదు. దీనిని బ‌ట్టి చూస్తే ఇద్ద‌రి మ‌ధ్య బేధాభిప్రాయాలు వ‌చ్చాయ‌ని, వారు విడాకులు తీసుకోబోతున్నార‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. అయితే ఇక్కడ మ‌రో వాద‌న కూడా ఉంది. పాండ్యానే న‌టాషాకి కొంత కాలం సోష‌ల్ మీడియాలో త‌న‌కి సంబంధించి ఎలాంటి పిక్స్ షేర్ చేయోద్దని అన్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం త‌న‌పై విప‌రీత‌మైన నెగెటివిటీ ఉండ‌డంతో న‌టాషాని కొంత కాలం సోషల్ మీడియాకి దూరంగా ఉండ‌మ‌ని పాండ్యానే చెప్పాడ‌ట‌. ఆ కార‌ణంగానే ఆమె ఎలాంటి పిక్స్ షేర్ చేయ‌డం లేద‌ని తెలుస్తుంది. అయితే రీసెంట్‌గా న‌టాషా.. నుదుటిపై బొట్టు పెట్టుకుని.. “అతడి ప్రేమ వల్లే ఈ మెరుపు” అంటూ ఓ పిక్ ను పోస్ట్ చేసింది. అంటే వారిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని, ఎంతో సంతోషంగా ఉన్నార‌ని ఈ పోస్ట్ ద్వారా అర్ధ‌మ‌వుతుంది. ఏది ఏమైన వీరి విడాకుల గురించి జోరుగా జ‌రుగుతున్న ప్రచారంపై ఓ క్లారిటీ అయితే రావ‌ల‌సి ఉంది.

Latest News