ICC rankings| ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన భారత్.. తన స్థానం నిలబెట్టుకున్న సూర్య
ICC rankings| ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వార్షిక టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా దుమ్మురేపింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 264 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మరి కొద్ది రోజులలో టీ20 వరల్డ్ కప్ జరగనుండగా, దాని కన్నా ముందు విడుదల చేసిన జాబితా

ICC rankings| ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వార్షిక టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా దుమ్మురేపింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 264 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మరి కొద్ది రోజులలో టీ20 వరల్డ్ కప్ జరగనుండగా, దాని కన్నా ముందు విడుదల చేసిన జాబితాలో టీమిండియా 264 రేటింగ్ పాయింట్స్‌తో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా(257) ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని రెండో స్థానంలో నిలవగా.. ఇంగ్లండ్(254),వెస్టిండీస్ (252), న్యూజిలాండ్( 250) తర్వాతి స్థానాలలో నిలిచాయి. ఇక పాకిస్తాన్ మరియు సౌతాఫ్రికా(244) పాయింట్స్‌తో ఉండగా, పాకిస్తాన్ డెసిమల్ పాయింట్స్‌తో కాస్త ముందు ఉంది.
ఇక టీ20 ప్రపంచకప్‌కు ముందు పొట్టి ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు కూడా అదరగొట్టారు. ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ లు తమ తమ స్థానాలను మెరుగుపరచుకోవడం మనం చూడవచ్చు. అర్ష్‌దీప్ సింగ్ ఏకంగా 16 స్థానాలు పైకి ఎగబాకగా, అక్షర్ పటేల్ ఓ స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఆదిల్ రషీద్ మొదటి స్థానంలో ఉన్నాడు.
ఐసీసీ టీ20 మెన్స్ బౌలింగ్ ర్యాంకింగ్స్..
ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్) – 722 రేటింగ్ పాయింట్లు
వనిందు హసరంగ (శ్రీలంక) – 687 రేటింగ్ పాయింట్లు
అక్షర్ పటేల్ (భారత్) – 660 రేటింగ్ పాయింట్లు
మహీశ్ తీక్షణ (శ్రీలంక) – 659 రేటింగ్ పాయింట్లు
రవి బిష్ణోయి (భారత్) – 659 రేటింగ్ పాయింట్లు
ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 861 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఆ తరువాత వరుసగా ఫిల్ సాల్ట్, మమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజాం, మార్‌క్రమ్‌లు నిలిచారు. ఇక టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానం పైకి ఎగబాకి 714 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు.
ఐసీసీ మెన్స్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్..
సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 861 పాయింట్లు
ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) – 788 పాయింట్లు
మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్) – 769 పాయింట్లు
బాబర్ ఆజం (పాకిస్తాన్) – 761 పాయింట్లు
ఐడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) – 733 పాయింట్లు
ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో శ్రీలంక ప్లేయర్ వనిందు హసరంగ (228) టాప్ ర్యాంకర్. వరల్డ్ కప్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్య (185) ఒక్కడే ఆరో స్థానంలో నిలిచాడు.