అఫ్గానిస్తాన్ తో టెస్టు..వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన

అఫ్గానిస్థాన్‌తో టెస్టు, వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపిక కాగా బుమ్రా, జడేజాలకు విశ్రాంతి ఇచ్చారు.

అఫ్గానిస్తాన్ తో టెస్టు..వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన

అఫ్గానిస్థాన్‌తో టెస్టు, వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్లను చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఐపీఎల్ ముగిసిన వెంట‌నే టీమిండియా స్వ‌దేశంలో అప్గానిస్తాన్‌తో ఒక టెస్టు స‌హా మూడు వ‌న్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ మంగళవారం భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఏకైక టెస్టుతో పాటు వన్డేలకు శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జూన్‌ 6 నుంచి ముల్లన్‌పూర్‌ వేదికగా భారత్‌, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌ జరగనుంది. సీనియర్‌ క్రికెటర్లు రవీంద్ర జడేజాతో పాటు స్పీడస్టార్‌ జస్ప్రీ‌త్‌ బుమ్రాలకు అఫ్గాన్‌తో సిరీస్‌కు విశ్రాంతి కల్పించిట్లు బీసీసీఐ తెలిపింది.

వన్డేజట్టు: గిల్‌ (కెప్టెన్‌), శ్రేయస్‌ (వైస్‌ కెప్టెన్‌), రోహిత్, కోహ్లీ, రాహుల్, ఇషాన్, పాండ్య, నితీశ్‌, సుందర్, కుల్దీప్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్, ప్రిన్స్ యాదవ్, బ్రార్, హర్ష్ దుబే.

టెస్టు: గిల్ (కెప్టెన్‌), రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), జైస్వాల్, సాయి సుదర్శన్, పంత్, పడిక్కల్, నితీశ్‌, సుందర్, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్, మానవ్ సుతార్, బ్రార్, హర్ష్‌, జురేల్‌.

మ్యాచ్‌ల షెడ్యూల్‌..

జూన్‌ 6 నుంచి 10 వరకు- ఏకైక టెస్టు (ముల్లన్‌ పూర్‌, ఛండీగఢ్‌)

తొలి వన్డే : జూన్ 14 (ధర్మశాల)

రెండో వన్డే : జూన్‌ 17 (లక్నో)

మూడో వన్డే : జూన్ 20 (చెన్నై)

ఇవి కూడా చదవండి :

తెలంగాణ ఐఏఎస్ లు ముగ్గురికి జాతీయ పురస్కారాలు
బెర్ముడా ట్రయాంగిల్‌ రహస్యాన్ని ఛేదించే క్లూ దొరికిందా? అమెరికా శాస్త్రవేత్తల కీలక అధ్యయనం..