IPL 2024| ఆదివారం మ్యాచ్ హైలైట్స్.. మ‌రో ఓట‌మితో ఆర్సీబీకి ప్లే ఆఫ్ ఆశ‌లు గ‌ల్లంతైన‌ట్టేనా?

IPL 2024| ఆదివారం ఐపీఎల్ 2024లో భాగంగా జ‌రిగిన రెండు మ్యాచ్‌లు థ్రిల్లింగ్‌ని అందించాయి. ముందుగా కేకేఆర్ వ‌ర్సెస్ ఆర్సీబీ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌గా ఆ మ్యాచ్‌

  • By: sn    sports    Apr 22, 2024 6:42 AM IST
IPL 2024| ఆదివారం మ్యాచ్ హైలైట్స్.. మ‌రో ఓట‌మితో ఆర్సీబీకి ప్లే ఆఫ్ ఆశ‌లు గ‌ల్లంతైన‌ట్టేనా?

IPL 2024| ఆదివారం ఐపీఎల్ 2024లో భాగంగా జ‌రిగిన రెండు మ్యాచ్‌లు థ్రిల్లింగ్‌ని అందించాయి. ముందుగా కేకేఆర్ వ‌ర్సెస్ ఆర్సీబీ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌గా ఆ మ్యాచ్‌లో కోల్‌క‌త్తా ఒక్క ర‌న్ తేడాతో గెలిచింది. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీ ఓటమిపాలు కావ‌డం అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గుర‌య్యేలా చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), ఆండ్రీ రస్సెల్(20 బంతుల్లో 4 ఫోర్లతో 27 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్ చేయ‌గా, శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. రమణ్‌దీప్ సింగ్(9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) కేకేఆర్ మంచి స్కోరు సాధించ‌డంలో భాగం అయ్యారు.

ఇక లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులకు కుప్ప‌కూలింది. విల్ జాక్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), రజత్ పటీదార్(23 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించ‌గా, దినేశ్ కార్తీక్(18 బంతుల్లో 3 ఫోర్లతో 24), కర్ణ్ శర్మ(7 బంతుల్లో 3 సిక్స్‌లతో 20) జ‌ట్టుని గెలిపించే ప్ర‌యత్నం చేశారు. కాని ఉప‌యోగం లేకుండా పోయింది. అంచనాలు లేని సమయంలో సంచలన బ్యాటింగ్‌తో చెలరేగిన కర్ణ్ శర్మ.. విజయలాంఛనాన్ని పూర్తి చేయలేకపోవ‌డంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.ఇక విరాట్ కోహ్లీ ఔట్ వివాదాస్ప‌దంగా మారింది. హై ఫుల్‌ టాస్‌కు విరాట్ కోహ్లీ క్యాచ్ ఔట్‌గా ప్ర‌క‌టించాడు థర్డ్ అంపైర్. న‌డుము క‌న్నా ఎత్తు వ‌చ్చిన దానిని ఔట్‌గా ప్ర‌క‌టించ‌డంపై కోహ్లీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఐపీఎల్ 2024 లీగ్‌లో ఆర్సీబీకి ఇది వరుసగా ఆరో ఓటమి. ఓవరాల్‌గా ఏడో పరాజయం. దీంతో దాదాపు ప్లేఆఫ్ రేసు నుండి ఈ జ‌ట్టు నిష్క్రమించినట్లే

ఇక మ‌రో మ్యాచ్ చూస్తే..ది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రాహుల్ తెవాటియా సంచలన బ్యాటింగ్ వ‌ల‌న గుజ‌రాత్ మంచి విజ‌యం సాధించింది.పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(21 బంతుల్లో 3 ఫోర్లతో 35), హర్‌ప్రీత్ బ్రార్(12 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 29), సామ్ కరణ్(19 బంతుల్లో 2 ఫోర్లతో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక ల‌క్ష్య చేధ‌న‌లో గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసి విజయాన్ని సాధించింది.. శుభ్‌మన్ గిల్(29 బంతుల్లో 5 ఫోర్లతో 35), సాయి సుదర్శన్(34 బంతుల్లో 3 ఫోర్లతో 31) మొద‌ట్లో దాటిగా ఆడగా.. రాహుల్ తెవాటియా(18 బంతుల్లో 7 ఫోర్లతో 36 నాటౌట్) మెరుపులు మెరిపించి గెలిపించాడు. అయితే 18వ ఓవర్‌లో కగిసో రబడా 20 పరుగులిచ్చి పంజాబ్ కొంపముంచాడు.