ఇక క్రికెట్టే క్రికెట్టు.. జూలై వరకు నాన్‌స్టాప్‌ మ్యాచ్‌లు

విధాత: టీ ట్వంటీ వరల్డ్‌ కప్‌ నుంచి వైదొలిగిన భారత జట్టు తన తర్వాత మ్యాచ్‌లకు సిద్ధమైంది. నవంబర్‌ 17 నుంచి 2022 జూలై వరకు ఎకధాటిగా మ్యాచ్‌లు ఆడనుంది న్యూజిలాండ్‌ భారత పర్యటనతో ప్రారంభమై జూలైలో ఇంగ్లాండ్‌లో భారత ప్యటనతో ముగుస్తుంది. ఈ సీజన్‌ మొత్తం క్రీడాభిమానులందరికీ మంచి వినోదం పంతుతుందనడంలో సందేహం లేదు. కాగా దాదాపు ఐదేండ్ల తర్వాత న్యూజిలాండ్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈపర్యటనలో భాగం గా నవంబరు 17 నుంచి […]

ఇక క్రికెట్టే క్రికెట్టు.. జూలై వరకు నాన్‌స్టాప్‌ మ్యాచ్‌లు

విధాత: టీ ట్వంటీ వరల్డ్‌ కప్‌ నుంచి వైదొలిగిన భారత జట్టు తన తర్వాత మ్యాచ్‌లకు సిద్ధమైంది. నవంబర్‌ 17 నుంచి 2022 జూలై వరకు ఎకధాటిగా మ్యాచ్‌లు ఆడనుంది న్యూజిలాండ్‌ భారత పర్యటనతో ప్రారంభమై జూలైలో ఇంగ్లాండ్‌లో భారత ప్యటనతో ముగుస్తుంది. ఈ సీజన్‌ మొత్తం క్రీడాభిమానులందరికీ మంచి వినోదం పంతుతుందనడంలో సందేహం లేదు.

కాగా దాదాపు ఐదేండ్ల తర్వాత న్యూజిలాండ్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈపర్యటనలో భాగం గా నవంబరు 17 నుంచి డిసెంబరు 7 వరకు మూడు టీ20, రెండు టెస్టు సిరీస్‌లలో పాల్గొననుంది. అనంతరం టీమిండియా డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో దక్షిణా ఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ ట్వంటీలు ఆడనుంది.

అదేవిధంగా ఫిబ్రవరిలో వెస్టండీస్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ ట్వంటీ మ్యచ్‌లు ఆడనుంది. అనంతరం శ్రీలంక జట్టు భారత పర్యటనకు రా నుంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు, మూడు టీ ట్వంటీలు ఆడనుంది. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది ఈ పర్యటనలో ఐదు టీ ట్వంటీలు జరుగనున్నాయి. చివరగా జూలైలో భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లినుంది అక్కడ మూడు వన్డేలు, మూడు టీ ట్వంటీ లు, ఒక టెస్టు ఆడనుంది.

ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ షెడ్యూల్‌

►మొదటి టీ20- నవంబరు 17, జైపూర్‌. ►రెండో టీ20- నవంబరు 19, రాంచి. ►మూడో టీ20- నవంబరు 21, కోల్‌కతా. ►మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్‌. ►రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబై.

దక్షిణాఫ్రికా వర్సెస్‌ ఇండియా 2021-22 షెడ్యూల్‌

► మొదటి టెస్టు- డిసెంబరు 17-21, జొహన్నస్‌బర్గ్‌. ► రెండో టెస్టు- డిసెంబరు 26-30, సెంచూ రియన్‌ ► మూడో టెస్టు- జనవరి 3-7, కేప్‌టౌన్‌ ► మొదటి వన్డే- జనవరి 11, పర్ల్‌ ► రెండో వన్డే- జనవరి 14, కేప్‌టౌన్‌ ► మూడో వన్డే- జనవరి 16, కేప్‌టౌన్‌ ► మొదటి టీ20- జనవరి 19, కేప్‌టౌన్‌ ► రెండో టీ20- జనవరి 21, కేప్‌టౌన్‌ ► మూడో టీ20- జనవరి 23, కేప్‌టౌన్‌ ► నాలుగో టీ20- జన వరి 26, పర్ల్‌

ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ షెడ్యూల్‌

►మొదటి వన్డే- ఫిబ్రవరి 6, అహ్మదాబాద్‌ ► రెండో వన్డే- ఫిబ్రవరి 9, జైపూర్‌ ► మూడో వన్డే- ఫిబ్రవరి 12, కోల్‌కతా ► మొదటి టీ20- ఫిబ్రవరి 15, కటక్‌ ► రెండో టీ20- ఫిబ్రవరి 18, విశాఖపట్నం ► మూడో టీ20- ఫిబ్రవరి 20, త్రివేండ్రం

ఇండియా వర్సెస్‌ శ్రీలంక షెడ్యూల్‌

► మొదటి టెస్టు- ఫిబ్రవరి 25- మార్చి 1, బెంగళూరు ► రెండో టెస్టు- మార్చి 5-9, మొహాలి ► మొదటి టీ20- మార్చి 13, మొహాలి ► రెండో టీ20- మార్చి 15, ధర్మశాల ► మూడో టీ20- మార్చి 18, లక్నో.

ఇండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా 2022 షెడ్యూల్‌

►మొదటి టీ20- జూన్‌ 9, చెన్నై ►రెండో టీ20- జూన్‌ 12, బెంగళూరు ►మూడో టీ20- జూన్‌ 14, నాగ్‌పూర్‌ ►నాలుగో టీ20- జూన్‌ 17, రాజ్‌కోట్‌ ►ఐదో టీ20- జూన్‌ 19, ఢిల్లీ

ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఇండియా 2022 షెడ్యూల్‌

► రీ షెడ్యూల్డ్‌ టెస్టు- జూలై 1-5, బర్మింగ్‌హాం ► మొదటి టీ20- జూలై 7, సౌతాంప్టన్‌ ► రెండో టీ20- జూలై 9, బర్మింగ్‌హాం ► మూడో టీ20- జూలై 10, నాటింగ్‌హాం ► మొదటి వన్డే- జూలై 12, లండన్‌ ► రెండో వన్డే- జూలై 14, లండన్‌ ► మూడో వన్డే- జూలై 17, మాంచెస్టర్‌