ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన వీరులు వీళ్లే

టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శిఖర్‌ ధావన్‌ ఈ ఏడాది సీజన్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్‌లో ధావన్‌ అరుదైన ఘనత సాధించాడు. లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా ధావన్‌ నిలిచాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ ఫీట్‌ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ధావన్‌ 46 పరుగులు పూర్తి చేయడం ద్వారా చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనాను తాజాగా […]

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన  వీరులు  వీళ్లే

టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శిఖర్‌ ధావన్‌ ఈ ఏడాది సీజన్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్‌లో ధావన్‌ అరుదైన ఘనత సాధించాడు. లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా ధావన్‌ నిలిచాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ ఫీట్‌ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో ధావన్‌ 46 పరుగులు పూర్తి చేయడం ద్వారా చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనాను తాజాగా ధావన్‌ అధిగమించాడు. ఐపీఎల్‌ 2021లో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల(311)తో గబ్బర్‌ ప్రస్తుతం ఆరెంజ్‌ క్యాప్‌ను దక్కించుకున్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ 6వేల పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

విరాట్‌ కోహ్లీ 6041
శిఖర్‌ ధావన్‌ 5507
సురేశ్‌ రైనా 5489
డేవిడ్ వార్నర్‌ 5447
రోహిత్‌ శర్మ 5445
ఏబీ డివిలియర్స్‌ 5053