Fraud Lady | పెళ్లి మీద పెళ్లి.. ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకున్న 30 ఏళ్ల మహిళ..!
Fraud Lady | సాధారణంగా అమ్మాయిలను మోసం చేసి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకున్న అబ్బాయిలను గురించి విన్నాం. అబ్బాయిలను మోసం చేసి అనేక పెళ్లిళ్లు చేసుకున్న అమ్మాయిల ఉదంతాలు చాలా తక్కువగా జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నిత్య పెళ్లికూతురు సంగతి బయటపడింది. ఆమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకుంది. ఒకరి తర్వాత ఒకరిని మోసం చేస్తూ పెళ్లిళ్లు 50 మందిని వివాహమాడింది.

Fraud Lady : సాధారణంగా అమ్మాయిలను మోసం చేసి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకున్న అబ్బాయిలను గురించి విన్నాం. అబ్బాయిలను మోసం చేసి అనేక పెళ్లిళ్లు చేసుకున్న అమ్మాయిల ఉదంతాలు చాలా తక్కువగా జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నిత్య పెళ్లికూతురు సంగతి బయటపడింది. ఆమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకుంది. ఒకరి తర్వాత ఒకరిని మోసం చేస్తూ పెళ్లిళ్లు 50 మందిని వివాహమాడింది. వారిలో పలువురు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. ఆ కిలాడీ లేడి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తమిళనాడులోని తిరుపూర్ జిల్లా తారాపురానికి చెందిన 35 ఏళ్ల పళని అనే వ్యక్తికి వివాహం కాలేదు. వివాహం కోసం కలలు కంటున్నా అతనికి ఎక్కడా సంబంధాలు కుదరడం లేదు. దాంతో అతను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ‘అంబ్ డేట్ ది తమిళ్ వే’లో పేరు నమోదు చేసుకున్నాడు. ఆ వెబ్‌సైట్‌లో సంధ్య (30) అనే యువతి పరిచయమైంది. ఈరోడ్ జిల్లా కొడుమూడికి చెందిన సంధ్య అతడితో పెళ్లికి అంగీకరించింది. వీరిద్దరూ కొన్ని రోజులు ఆన్‌లైన్లో చాటింగ్ చేసుకున్నారు. ఆమెకు అవసరమైనప్పుడల్లా అతను డబ్బులు పంపేవాడు.
ఆ తర్వాత వారికి వివాహం చేసేందుకు అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించారు. వధువుకు కావాల్సిన నగలు, పట్టుచీరలు అన్నీ వరుడి కుటుంబీకులు కొనుగోలు చేశారు. అనంతరం సంధ్య, పళని ఇద్దరూ సమీపంలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. వారు 3 నెలలు సంతోషంగా కాపురం చేశారు. ఈ క్రమంలో ఓ సందర్భంలో పళని.. సంధ్య ఆధార్ కార్డును పరిశీలించగా.. భర్త స్థానంలో చెన్నైకి చెందిన మరో వ్యక్తి పేరు ఉంది. దాంతో షాక్‌కు గురైన పళని ఆమెను నిలదీశాడు.
తాను దొరికిపోయానని గ్రహించిన సంధ్య తన భర్తతో, అతని కుటుంబ సభ్యులతో గొడవకు దిగింది. తనను విసిగిస్తతే అందరినీ చంపేస్తానని బెదిరించింది. దాంతో పళని కుటుంబసభ్యులు తారాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆమెకు పదేళ్ల క్రితం పెళ్లయిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని తేలింది. అంతేకాదు మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆమె పలువురిని వరుసగా 50 మందిని వివాహాలు చేసుకుని మోసపోయినట్లు బయటపడింది.
సంధ్య చేతిలో మోసపోయిన వారిలో పలువురు వ్యాపారవేత్తలు, ఫైనాన్షియర్లు, పోలీసు అధికారులు కూడా ఉన్నారని వెల్లడైంది. పెళ్లి చేసుకుని కొన్ని నెలలు కాపురం చేయడం, తర్వాత గొడవపడి బంగారు ఆభరణాలు, నగదు తీసుకుని విడిపోవడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. సంధ్య బాధితుల్లో ఎ డీఎస్పీతోపాటు పలువురు ఎస్‌ఐలు కూడా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జైలుకు తరలించారు.