Asteroids | శుక్రుడి సమీపాన దాగిన భారీ ఆస్టరాయిడ్స్‌.. హెచ్చరికలు లేకుండా భూమిని ఢీకొనే ముప్పు!

సహ కక్ష్య గ్రహశకలాలుగా పిలిచే ఇవి.. శుక్రుని చుట్టూ పరిభ్రమించవు. కానీ.. సూర్యుని చుట్టూ ఉన్న కక్ష్యలను అనుసరిస్తాయని అంటున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి భారీ గ్రహశకలాలను 20 వరకూ కనుగొన్నారు. అందులో కొన్ని ట్రోజన్‌ ఆస్టరాయిడ్స్‌ కూడా ఉన్నాయి.

Asteroids | శుక్రుడి సమీపాన దాగిన భారీ ఆస్టరాయిడ్స్‌.. హెచ్చరికలు లేకుండా భూమిని ఢీకొనే ముప్పు!

Asteroids | ఈ ధరిత్రి పెను ప్రమాదంలో ఉన్నదా? ఒక నగరాన్ని ధ్వంసం చేసిపారేయగల ఆస్టరాయిడ్స్‌.. సుదీర్ఘకాలంలో భూమిని ఢీకొనే అవకాశం ఉన్నదా? అంటే.. అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. శుక్రుడి సమీపాన ఉండి.. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న పెద్ద సంఖ్యలో భారీ గ్రహశకలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక్కోటీ ఒక నగరాన్ని నామరూపాలు లేకుండా చేస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వీటి నుంచి దీర్ఘకాలంలో భూమికి పెను ముప్పు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి సాధారణ గ్రహశకలాలు కావని, అనేక గ్రహశకలాలు 140 మీటర్లకు మించి ఉన్నాయని అంటున్నారు. అన్నింటికంటే ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే.. వీటి కదలికలను గుర్తించడం అంత సులభం కాదు. సూర్యుని కాంతి తీవ్రత కారణంగా టెలిస్కోపులు సైతం వాటిని గుర్తించలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

సహ కక్ష్య గ్రహశకలాలుగా పిలిచే ఇవి.. శుక్రుని చుట్టూ పరిభ్రమించవు. కానీ.. సూర్యుని చుట్టూ ఉన్న కక్ష్యలను అనుసరిస్తాయని అంటున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి భారీ గ్రహశకలాలను 20 వరకూ కనుగొన్నారు. అందులో కొన్ని ట్రోజన్‌ ఆస్టరాయిడ్స్‌ కూడా ఉన్నాయి. ఇవి శుక్ర గ్రహ కక్ష్యలో శుక్ర గ్రహానికి ముందుగానీ, వెనుకగానీ ఉంటాయి. జూజ్వే అని పిలుస్తున్న చంద్రుడిలాంటి ఒక ఆస్టరాయిడ్‌ కూడా ఉన్నది. అంగారకుడు, బృహస్పతి మధ్య ఉండే ప్రధాన గ్రహశకలం బెల్ట్‌ నుంచి ఇవి ఉద్భవించాయని, గురుత్వాకర్షణ శక్తితో శుక్ర గ్రహ సమీపానికి ఆకర్షితమయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వాటి పరిమాణం మాత్రమే కాదు.. అవి వాటిని గమనించే వీలు లేకపోవడం ప్రధాన ఆందోళనగా ఉన్నది. భూమితో పోల్చితే సూర్యుడిని శుక్ర గ్రహం సమీపాన ఉంటుంది. దీంతో సూర్యుడి నుంచి వెలువడే కాంతి తీవ్రత (రిఫ్లెక్షన్‌) కారణంగా వాటిని భూమిపై ఉండే టెలిస్కోపులు పసిగట్టలేకపోతున్నాయి. వ్యోమగాములకు సైతం అవి చాలా అస్పష్టంగానే కనిపిస్తున్నాయి.

సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో అవి భూకక్ష్యలోకి కూడా సులభంగా ప్రవేశించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు అవి భూమికి ముప్పు కలిగించేవి కావని, అంత మాత్రాన వాటితో ప్రమాదం లేదని భావించడానికి వీల్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి ఒక స్థిర కక్ష్యలో లేకపోవడమే పెను సవాలని అంటున్నారు. కక్ష్యలో తిరిగేవి అయితే.. ఎటూ మళ్లే అవకాశాలు ఉండవు. గ్రహాల గురుత్వాకర్షణ శక్తి, ప్రత్యేకించి భూమి గురుత్వాకర్షణ శక్తి కుదుపులు వాటిని దారి మళ్లించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

రాబోయే 36వేల సంవత్సరాల్లో ఈ ఆస్టరాయిడ్స్‌ కదలిక ఎలా ఉండొచ్చనే అంశంలో సావో పాలో స్టేట్‌ యూనివర్సిటీ పరిధోకులు సిమ్యులేషన్స్‌ నడిపించారు. వాటిలో చాలా వరకూ నిర్దిష్ట మార్గంలోనే తిరిగినా.. కొన్నింటి ప్రవర్తన దీర్ఘకాలంలో భూమికి అత్యంత సమీపానికి వచ్చే అవకాశాలు లేకపోలేదని వాటి ద్వారా అంచనా వేశారు. శుక్రగ్రహం భూమికి 4 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నందున వాటి గమనంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. తీవ్ర ఆందోళనకర పరిస్థితి తలెత్తవచ్చని చెబుతున్నారు. భూమిని ఢీకొనే అవకాశాలు చాలా స్వల్పంగానే ఉన్నప్పటికీ.. చాలా అప్రమత్తంగా ఉండాలని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ వెలెరియా కర్రుబా చెప్పారు.

ఇవి కూడా చదవండి..

Eco Friendly Plastic | ప్లాస్టిక్ పీడకు తిరుగులేని విరుగుడు కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
Kabul Water Crisis | ఆధునిక రాజధాని నగరం.. కొన్నాళ్లలోనే చుక్క నీరూ దొరకదు!
Talking fish: మాట్లాడే చేపలు.. ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసా..?
snakes take revenge: పాములు పగబడతాయా? నాదస్వరానికి నాట్యం చేస్తాయా? నిజమెంత?