Sucker fish | మత్స్యకారుల వలకు ఓ దెయ్యం చేప చిక్కింది. దాంతో వారు షాక్ తిన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సునీల్ జాదవ్, అనిల్ జాదవ్, కృష్ణ సత్పుటే అనే మత్స్యకారులు తాజాగా కసరి నదిలో చేపట వేటకు వెళ్లారు. ఈ సందర్భంగా తమ వలలో చిక్కిన చేపను చూసి వారు కంగుతిన్నారు. ఎందుకంటే వారి వలకు చిక్కింది పనికిమాలిన చేప. అది తినడానికి పనికిరాదు. ఔషధాల తయారీకీ అక్కర రాదు. పైగా ఈ చేప చెరువులో ఉన్నా, కుంటలో ఉన్నా, నదిలో ఉన్నా, కాలువలో ఉన్నా అక్కడంతా సర్వనాశనమే.
Sucker fish : మత్స్యకారుల వలకు ఓ దెయ్యం చేప చిక్కింది. దాంతో వారు షాక్ తిన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సునీల్ జాదవ్, అనిల్ జాదవ్, కృష్ణ సత్పుటే అనే మత్స్యకారులు తాజాగా కసరి నదిలో చేపట వేటకు వెళ్లారు. ఈ సందర్భంగా తమ వలలో చిక్కిన చేపను చూసి వారు కంగుతిన్నారు. ఎందుకంటే వారి వలకు చిక్కింది పనికిమాలిన చేప. అది తినడానికి పనికిరాదు. ఔషధాల తయారీకీ అక్కర రాదు. పైగా ఈ చేప చెరువులో ఉన్నా, కుంటలో ఉన్నా, నదిలో ఉన్నా, కాలువలో ఉన్నా అక్కడంతా సర్వనాశనమే.
ఇంతకూ ఈ చేప పేరు ఏందంటే సక్కర్ ఫిష్. దీని లక్షణాలను బట్టి దెయ్యం చేప అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఎక్కడున్నా మిగతా చేపలను ఎదగనియ్యదు. ఇతర చేపల గుడ్లు, పిల్లలను అమాంతం మింగేస్తుంది. తన పరిమాణాన్ని బట్టి తన కంటే చిన్న చేపలను కూడా తినేస్తుంది. అదే సమయంలో తన సంతానాన్ని భారీగా పెంచుకుంటుంది. ఇవి విపరీతంగా మాసం తింటాయి. అందుకే ఇతర జాతుల చేపలను వెంటాడి, వేటాడి చంపుకుని తింటాయి. అందుకే ఈ చేప కనిపించిందంటే ఇక అక్కడ ఇతర చేపలు మిగలవని మత్స్యకారులు ఆందోళన చెందుతుంటారు.
ఈ దెయ్యం చేప చూడటానికి కూడా టోటల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒంటిపైన పొలుసులు ఉండవు. చారలు మాత్రమే ఉంటాయి. నోరు ముందు వైపున కాకుండా పంది నోరులా ముట్టె కింది భాగంలో ఉంటుంది. ఈ చేప ఆకారం విమానంలా కనిపిస్తుంది. అందుకే దీన్ని విమానం చేప అని కూడా అంటారు. దీని ఒంట్లో మాంసం కూడా పెద్దగా ఉండదు. శరీరానికి రెండు పక్కలా రాయిలాంటి గట్టి బోన్స్ ఉంటాయి. ఈ చేప మాంసం పెడితే నమిలి గుటుక్కున మింగేస్తుంది. రాళ్లనైనా జీర్ణం చేసుకునే శక్తి ఈ చేపకు ఉంటుంది. ఆక్సిజన్ తక్కువగా ఉన్నా జీవిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దెయ్యం చేప జగమొండిది.
ఈ చేప భూమి పొరల్లోకి దూసుకుపోతుంది. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వేగంగా, సునాయాసంగా చేరుతుంది. ఈ చేపలు అక్వేరియంలలో అట్రాక్షన్ కోసం మాత్రమే పనికొస్తాయి. ఈ సక్కర్ చేప హోంనివారిస్కు చెందిందిగా మత్స్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీని శాస్త్రీయ నామం హైపోస్తోమస్ క్లిపికోస్తోమస్. నార్త్ అమెరికాలో దీన్ని ఆక్వేరియంలలో పెంచుతారు. తిండి పెట్టకపోయినా ఆక్వేరియం అద్దాలకు పట్టే పాచి తిని బతుకుతాయి. ఒంటి నిండా మచ్చలు, తల పైభాగంలో కళ్లు ఉంటాయి. వీటి పళ్లకు పదునెక్కువ. ఈ చేపను నాశనం చేసే మందును కనిపెట్టాల్సి ఉందని, ఇప్పటి వరకు సాధ్యం కాలేదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.