Smart Watches | ఇవిగో.. ఐదువేలలోపు ధరలో పది అద్భుతమైన స్మార్ట్ వాచ్‌లు
ఈమధ్య స్మార్ట్ వాచ్‌లు భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సాంకేతిక ఉపకరణాలుగా మారాయి. ఖచ్చతమైన ఆరోగ్య సమాచారం, అద్భుతమైన సౌలభ్యాలతో వివిధ బ్రాండ్లు పోటీ పడి మరీ తయారుచేస్తున్నాయి. దీంతో వినియోగదారులకు చాలా ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేకించి రూ.5 వేల లోపు విస్తారంగా రకరకాల బ్రాండ్లు మార్కెట్లో ప్రవేశించాయి. వాటిల్లో ఎంపిక చేయబడ్డ ఓ పది వాచీలు… మీ కోసం.

- అమేజ్ఫిట్ బ్యాండ్ 7 (Amazfit Band 7 ):
అమేజ్ఫిట్ బ్యాండ్ 7 ధృడమైన పాలికార్బనేట్తో తయారై, మృదువైన సిలికాన్ స్ట్రాప్‌తో ఉంటుంది. 1.47 అంగుళాల అమోలెడ్ తెర చాలా స్పష్టంగా కనబడుతుంది. రక్తంలో ఆక్సిజన్(), గుండె కొట్టుకునే వేగం, నిద్రావ్యవస్థ, ఒత్తిడులపై నిరంతరం నిఘా పెడుతుంది. జెప్ ఓఎస్‌తో ఈ స్మార్ వాచ్ యాపిల్ ఐఓఎస్ తోనూ, ఆండ్రాయిడ్‌తోనూ చాలా సులభంగా కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్5.2తో పాటు పిపిజీ హార్ట్‌రేట్ సెన్సర్, ఆక్సిజన్ సెన్సర్, ఆక్సిలరోమీటర్తో వచ్చే ఈ బ్యాండ్ 5ఏటిఎమ్ వరకు వాటర్‌ప్రూఫ్ కూడా.
ప్రత్యేకతలు: అల్వేస్ ఆన్ డిస్ప్లే, అలెక్స్ బిల్టిన్, 18రోజుల బ్యాటరీ లైఫ్, 24గంటలూ గుండె, ఆక్సిజన్ మానిటరింగ్, 5ఏటిఎం వాటర్ ప్రూఫ్
ధర: రూ.3,999,00
- సామ్సంగ్ గెలాక్సీ ఫిట్ 3( Samsung Galaxy Fit3):
గెలాక్సీ ఫిట్ 3 సన్ననైన అల్యూమినియం బాడీతో, సిలికాన్ బ్యాండ్‌తో తేలిగ్గా, నాజూగ్గా ఉంటుంది. ఇది కూడా రక్తంలో ఆక్సిజన్, గుండె కొట్టుకునే వేగం, నిద్రావ్యవస్థ, ఒత్తిడులను ఎప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉంటుంది. యాపిల్, ఆండ్రాయిడ్ ఉపకరణాలతో సులభంగా పెయిర్ చేయొచ్చు. దీనిలో జిపిఎస్, గైరోస్కోప్, యాక్సిలరోమీటర్ ఉండటంతో మన శారీరక కార్యకలాపాలపై ఖచ్చితమైన సమాచారం ఇవ్వగలదు.
ప్రత్యేకతలు: 40ఎంఎం అమోలెడ్ డిస్ప్లే, అన్నిరకాల ఫిట్నెస్ ట్రాకింగ్ వ్యవస్థలు, 13రోజుల బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 5 ఏటీఎం వాటర్‌ప్రూఫ్.
ధర: రూ.4,499.00
- సిఎంఎఫ్ వాచ్ ప్రొ 2 (cmf Watch Pro 2):
ఇది ధృఢమైన జింక్ మిశ్రమంతో తయారైన ఫ్రేమ్ కలిగిఉండి, 1.91 అంగుళాల హెచ్డి డిస్ప్లేతో ఉంటుంది. ఇది కూడా అత్యంత అధునాతన ఫిట్నెస్ ట్రాకింగ్ వ్యవస్థను కలిగిఉంది. ఎస్పిఓ2, హార్ట్‌రేట్ మానిటరింగ్, స్లీప్ అనాలిసిస్ అందులో భాగాలు. ఇందులో బ్లూటూత్ 5.0, వైఫై, 4జి వీఓఎల్టీఈ ఉండటం వల్ల కాల్స్ చేసుకోవడం, మెసేజ్‌లు పంపుకోవడం కూడా చేయొచ్చు. తక్కువ ధరలో చాలా మంచి సౌకర్యాలతో ఉన్న వాచ్ ఇది.
ధర: రూ. 4,999.00
- హువామీ అమేజ్ఫిట్ అమోలెడ్( Huami Amazfit AMOLED ):
ఈ హువామీ అమేజ్ఫిట్ అమోలెడ్ అల్యూమినియం బాడీతో తయారై, 1.39 అంగుళాల తెర కలిగిఉంది. ఇది కూడా ఆరోగ్య విషయాలపై శ్రద్ధ పెడుతుంది. ఆక్సిజన్, హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్ లాంటి వ్యవస్థలు ఉన్నాయి. సొంత అమేజ్ఫిట్ ఓఎస్‌తో చాలా సున్నితమైన, వినియోగ అనుభవంతో ఉండే ఈ వాచ్‌లో బ్లూటూత్5.0, జిపిఎస్, బయో ట్రాకింగ్ సెన్సర్, ఆక్సిలరోమీటర్, ఏటీఎం5 లాంటి సౌకర్యాలున్నాయి.
ధర: రూ.4,999.00
- హామర్ కాంకర్(Hammer Conquer ):
ఈ వాచ్‌లో స్క్రీన్ పెద్దగా 2.02 అంగుళాలతో ఐపి67 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ ఫీచర్లతో వస్తోంది. ఇందులో కూడా అవసరమైన అన్ని ఆరోగ్య నిఘా వ్యవస్థలున్నాయి. ఫిట్నెస్ ట్రాకింగ్‌కు బాగా పనికొచ్చే ఈ వాచ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సౌలభ్యాలు కూడా ఎక్కువ. చాలా చౌకగా కూడా వస్తుంది.
ధర: 1,299.00
- అర్బన్ క్వెస్ట్(URBAN Quest):
ఇది కూడా చౌక వాచే కానీ, 1.69 అంగుళాల తెరతో, మృదువైన సిలికాన్ పట్టీతో చాలా సౌలభ్యాలతో ఉంటుంది. హార్ట్‌రేట్, ఆక్సిజన్, బిపి మానిటర్ లాంటి హెల్త్ మానిటరింగ్ వ్యవస్థలతో, ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లతో పనిచేసే విధంగా సొంత ఓఎస్ కలిగిఉంది. సాధారణంగా వాచీ వాడేవారు దీన్ని మంచి చాయిస్‌గా భావించవచ్చు.
ధర: 1,599.00
- బౌల్ట్ క్రౌన్ ఆర్ ప్రొ(Boult Crown R Pro):
ఈ వాచ్ లోహమిశ్రమంతో తయారై, ధృడంగా ఉంటుంది. 1.32 అంగుళాల తెరతో, అన్ని రకాల హెల్త్ నిఘా వ్యవస్థలు, అడుగుల లెక్కింపుతో సహా ఉన్నాయి. ఇది కూడా ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లతో పనిచేసే విధంగా సొంత ఓఎస్ కలిగిఉంది. సాధారణ వాడకానికి భాగా పనికొస్తుంది.
ధర: రూ.2,399.00
- ఫైర్ బోల్ట్ రాయల్ లగ్జరీ(Fire-Boltt Royale Luxury):
ఈ ఫైర్ బోల్ట్ రాయల్ లగ్జరీ స్మార్ట్‌వాచ్ పేరుకు తగ్గట్టే చాలా రాయల్‌గా, సన్నగా స్టైల్‌గా ఉంటుంది. 1.43 అంగుళాల హైరెజొల్యూషన్ తెరతో సన్నని స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. ఇది బ్లూటూత్ కాలింగ్‌తో పాటు 4జిబి స్టోరేజ్, 300 రకాల స్పోర్ట్స్ మోడ్లలో చాలా రకాల ఫిట్నెస్ కార్యకలాపాలకు అద్భుతంగా పనిచేస్తుంది. 5వేల లోపు గొప్ప ఫోన్లలతో ఇది కూడా ఒకటి.
ధర: రూ.2,499.00
- రెడ్ మీ వాచ్2 లైట్( Redmi Watch 2 Lite):
ఇదొక తేలికైన వాచ్. పాలికార్బనేట్ బాడీతో తయారై, 1.55 అంగుళాల టిఎఫ్టి తెరతో ఇది కూడా రక్తంలో ఆక్సిజన్, గుండె కొట్టుకునే వేగం, నిద్రావ్యవస్థ, ఒత్తిడులను ఎప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉంటుంది. యాపిల్, ఆండ్రాయిడ్ ఉపకరణాలతో సులభంగా పెయిర్ చేయొచ్చు. దీనిలో జిపిఎస్, గైరోస్కోప్, యాక్సిలరోమీటర్ ఉండటంతో పాటు 5ఎటీఎం కూడా ఉంది.
ధర: రూ. 2,999.00
- బోట్ వేవ్ మ్యాక్స్( boAt Wave Max):
ధృడమైన పాలికార్బనేట్తో తయారై, మృదువైన సిలికాన్ స్ట్రాప్‌తో ఉంటుంది. 1.83 అంగుళాల పెద్ద హెచ్డి తెరతో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆక్సిజన్, గుండె కొట్టుకునే వేగం, నిద్రావ్యవస్థ, ఒత్తిడులపై నిరంతరం నిఘా పెడుతుంది. స్వంత ఓఎస్‌తో ఈ స్మార్ వాచ్ యాపిల్ ఐఓఎస్ తోనూ, ఆండ్రాయిడ్‌తోనూ చాలా సులభంగా కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్5.1తో పాటు హార్ట్‌రేట్ సెన్సర్, ఆక్సిజన్ సెన్సర్, ఆక్సిలరోమీటర్తో వచ్చే ఈ బ్యాండ్ ఐపీ68 డస్ట్, వాటర్ ప్రూఫ్ కూడా.
ధర: రూ. కేవలం 999.00 మాత్రమే.
ఈ పది వాచ్‌ల ధర 5వేల లోపే ఉన్నా, పనితీరులో మిన్నగా ఉంటాయి. 5వేల లోపు వాచీలు చాలా ఉన్నా, ఈ పది మాత్రం సౌకర్యాల రీత్యా, వాటి పనితీరు దృష్ట్యా పెద్ద బ్రాండ్ వాచ్‌లతో పోటీ పడగలవు. వినియోగదారుల చాలా రకాల అవసరాలు ఈ వాచీలు సమర్థవంతంగా తీర్చగలవు.
ఇవన్నీ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ స్టోర్లలో లభిస్తాయి.