BSNL | మీది బిఎస్ఎన్ఎల్ మొబైలా..? అయితే జాగ్రత్త..!
బిఎస్ఎన్ఎల్ మొబైల్ చందాదారులను సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం లక్ష్యంగా చేసుకున్నారు. కేవైసీ అప్డేట్ లేకపోవడం వల్ల మీ కనెక్షన్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు మెసేజ్‌లు వస్తున్నాయి.

భారత ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ మొబైల్(BSNL Mobile subscribers) చందాదారులు కొంచెం జాగ్రత్తగా మసలుకోవాలని బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులను ఒక ప్రకటనలో హెచ్చరించింది. వాట్సప్ (Whatsapp)ద్వారా ఒక తప్పుడు నోటీస్(Fake Notice)ను పంపుతూ, మోసగాళ్లు (Fraudsters)వినియోగదారులను తప్పుదోవ పట్టించి డబ్బులు దోచేస్తున్నారు. వారు వాట్సప్‌లో పంపుతున్నమెసేజ్ ఇలా ఉంటుంది. “మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ కేవైసీని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. అందువల్ల మీకు మొబైల్ సేవలు 24 గంటల్లోగో నిలిచిపోతాయి. వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేయండి”. (Your BSNL Sim KYC has been suspended by Telecom Regulatory Authority of India. Your Sim card will be blocked within 24 hours. Call immediately). ఆ మెసేజ్ వస్తున్న నెంబర్ 88220 76791. ఇది బిఎస్ఎన్ఎల్ నెంబర్ కాకపోవడం గమనార్హం.
ఈ నోటీస్‌లో వెంటనే సంప్రదించాల్సిందిగా కేవైసీ ఎగ్జిక్యూటివ్(KYC Executive) నెంబర్ అని చెపుతూ, ఒక నెంబర్ కూడా ఇస్తున్నారు. చందాదారులు ఆ నెంబర్‌కు కాల్ చేయగానే రకరకాలుగా భయపెడుతూ, మీ సిమ్‌ను అన్‌బ్లాక్(Unblock) చేయడానికి కొంత సొమ్ము ఇమ్మని(Asks to make Payment) ఒత్తిడి తెస్తారు. వినియోగదారులు ఆ డబ్బులు పంపగానే అక్కడికి ఆ మోసం పూర్తవుతుంది.
నిజానికి ఇదంతా పూర్తిగా పచ్చి మోసం. బిఎస్ఎన్ఎల్ ఎవరికీ ఎలాంటి నోటీసు పంపలేదు, పంపదు కూడా. డబ్బులు దోచుకోవడానికి సైబర్ మోసగాళ్లు ఎంచుకున్న ఒకానొక మార్గం. ఈ విషయమై బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు మోసపోవద్దని, అటువంటి మెసేజ్‌లకు స్పందించకూడదని బిఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో(BSNL issued an official warning to its users) తన చందాదారులను హెచ్చరించింది.
మరిన్నివార్తలకు ఇక్కడ చదవండి..