Truecaller | నేటి నుండి ట్రూకాలర్ అవసరం లేదు

తెలియని నెంబర్ల నుండి వచ్చే కాల్స్​ మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. తెలిస్తే కాల్​ లిఫ్ట్​ చేయం కదా అని ట్రూకాలర్​ లాంటి అత్యంత ప్రమాదకర యాప్​లను ఇన్​స్టాల్​ చేసుకుంటాం. ఇక ఆ అవసరం లేదు. ఎవరు కాల్​ చేసారో  ట్రూకాలర్​ కంటే ఖచ్చితమైన సమాచారం ఇకనుండి ఏ యాప్​ లేకుండానే మనకు తెలిసిపోతుంది.

Truecaller | నేటి నుండి ట్రూకాలర్ అవసరం లేదు

ఎన్నో విచిత్రమైన కాల్స్​, స్పామ్​ కాల్స్​, మార్కెటింగ్​ కాల్స్​, ఫిషింగ్​ కాల్స్​, సైబర్​ ఫ్రాడ్​ కాల్స్​..ఇలా (Spam Calls, Phishing Calls, Cyber Fraud) ప్రతీరోజూ మనం ఎన్నో తెలియని నెంబర్లనుండి కాల్స్​ రిసీవ్​ చేసుకుంటాం. చాలాసార్లు చిరాకు, కొన్ని సార్లు ప్రమాదం తెచ్చే కాల్స్​ కూడా ఉంటాయి. ఆ కాల్​ ఎవరినుండి వస్తోందో ముందే తెలిసిపోతే ఇక ఆ కాల్​ను మనం ఎత్తం కదా. అందుకే ట్రూకాలర్​ (Truecaller) అనే ఒక చైనా యాప్​ వంద కోట్లకు పైగా ఫోన్లలోకి ప్రవేశించింది.

ట్రూకాలర్​.. భారత్​లో బాగా పేరుపొందిన యాప్​. మనకు తెలియని నెంబర్ల నుండి వచ్చే కాల్స్​ను నిరోధించుకోవడానికి ఈ ట్రూకాలర్​ యాప్​ను పెద్దఎత్తున మొబైల్​ వినియోగదారులు వాడుతున్నారు. ట్రూకాలర్​ ద్వారా ఆ నెంబర్​ ఎవరిదో తెలియడమే కారణం. కానీ అది 100శాతం ఖచ్చితమైన సమాచారం కాదు. ట్రూకాలర్​ యాప్​ మనం మన ఫోన్​లో ఇన్​స్టాల్​ చేసుకోగానే మన ఫోన్​బుక్​లో ఉన్న కాంటాక్ట్స్​(Phone Book) అన్నింటినీ అది స్టోర్​ చేసుకుంటుంది. అంతేకాక, చైనా(China)లో ఉన్న తన సర్వర్లకు పంపుతుంది. ఇలా ఇన్​స్టాల్​ అయిఉన్న అన్నీ ఫోన్ల నుండి కాంటాక్ట్​ సమాచారం సేకరించి మళ్లీ తిరిగి మనకే ఇస్తుంది. మనం బాగా గమనిస్తే, కొన్ని పేర్లు విచిత్రంగా ఉంటాయి. భాస్కర్​ చాచా, లిల్లీ డార్లింగ్​, గ్రాండ్​ మదర్​..ఇలా.. ఎందుకంటే ఆ నెంబర్​ను తెలిసిన వారెవరో ఇలాగే తమ ఫోన్​బుక్​లో సేవ్​ చేసుకుని ఉంటారు. అది అలాగే ట్రూకాలర్​కు వెళ్లిపోతుంది. ఆ నెంబర్​ నుండి మనకు కాల్​ వచ్చినప్పుడు ట్రూకాలర్​లో ఉన్న డాటానే మనకు డిస్​ప్లే అవుతుంది. కానీ, ట్రూకాలర్​ అక్కడితో ఆగదు. ఫోన్​లో ఉన్న సమస్త సమాచారాన్ని దొంగిలిస్తోంది. ఈ కారణంగానే భారత రక్షణ(Indian Defence Agencies) శాఖ ఈ యాప్​ను నిషేధించింది. త్రివిధ దళాలు, ఏజెన్సీలు, సున్నితమైన విభాగాల్లో పనిచేసేవారెవరూ ఈ యాప్​ను వాడొద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి మనం కూడా ఈ యాప్​ వాడకూడదు. ఇది చాలా డేంజరస్​ యాప్​. India Defence banned Truecaller.

కొన్ని స్మార్ట్​ఫోన్​ కంపెనీలు, ఉదాహరణకు సామ్​సంగ్​(Samsung) తన వినియోగదారులకు స్మార్ట్​ కాలింగ్​(Smart Calling)  అనే సేవను అందిస్తోంది. అయితే అది సామ్​సంగ్​ ఫోన్లు వాడేవారి నుండి కాల్​ వస్తేనే ఆ పేరు మనకు తెలుస్తుంది. గూగుల్​(Google) కూడా రివర్స్​ లుక్​అప్​ పేరుతో తన ఆండ్రాయిడ్​ సర్వీసుల్లో అందుబాటులో ఉన్న ఫోన్​ నెంబర్ల ఆధారంగా ఈ సర్వీసును ఇద్దామని తొలుత అనుకుంది కానీ, ప్రస్తుతం గూగుల్​ నుండి దీనిపై ఎటువంటి సమాచారం లేదు.

దీనికి ప్రత్యామ్నాయంగా  కేంద్రం ఓ మార్గం ఆలోచించింది. టెలికం సర్వీస్​ ప్రొవైడర్ల(TelecomService Proider)నే ఈ సౌలభ్యాన్ని అందించమని ఆదేశిస్తే..? దాని ఫలితమే కాలర్​ నేమ్​ ప్రజెంటేషన్​ సర్వీస్(Caller NAme Presentation – CNAP) ​. ప్రతీ మొబైల్​ సర్వీస్​ ప్రొవైడర్​ (MSP) సిమ్​ కార్డ్(SIM Card)​ ఇచ్చేముందు ఆధార్​ కాపీ(Aadhaar), ఫోటో, వేలిముద్రలు అడుగుతారు. ఆధార్​ వెరిఫై అయితేనే అదే పేరుతో మొబైల్​ కనెక్షన్​ ఇస్తారు. సరిగ్గా ఆ నిబంధననే వాడుకుని కనెక్షన్​ ఇచ్చినప్పుడు ఆ నెంబర్​పై వారి వద్ద ఉన్న పేరునే కాల్​ రిసీవర్​ ఫోన్​లో కనిపించేవిధంగా ఏర్పాటు చేయాల్సిందిగా ట్రాయ్​(TRAI – Telecom Regulatory Authority of India) అన్ని మొబైల్​ సర్వీస్​ ప్రొవైడర్ల(Jio, Airtel, Vodafone, BSNL)ను ఆదేశించింది. అయితే, ఈ నిబంధనను ప్రొవైడర్లు ముందు వ్యతిరేకించాయి. కానీ, కేంద్రం(Govt. of India), ట్రాయ్​(TRAI) ఒత్తిడి మేరకు తలొగ్గి, CNAP ఏర్పాట్లు చేసుకోనారంభించాయి. ఇప్పటికే ముంబయి, హర్యానాలలో ట్రయల్స్​ నిర్వహించిన ఎంఎస్​పీలు దేశవ్యాప్తంగా ఈ సీనాప్​(CNAP) సేవలను జులై 15(July 15, 2024) నుండి అందించడానికి సిద్ధం కావాలని ట్రాయ్​ ఆదేశించింది. దీని ప్రకారం రేపటి నుండి మన కాంటాక్ట్స్​లో లేని నెంబర్ల నుండి కాల్​ వస్తే, ఆ నెంబర్​కు సంబంధించిన ఆధార్​ ధృవీకరణ ఆధారంగా పేరు కనబడుతుంది. ఇక అప్పుడు ఆ కాల్​ ఎత్తాలా? వద్దా? అనేది మన ఇష్టం.

జులై 15, 2024 నుండి ఈ సేవలు దేశవ్యాప్తంగా అందించాలని ట్రాయ్​ ఆదేశాలున్నప్పటికీ, ఎంఎస్పీలు రేపటి నుండి అందిస్తున్నాయా, లేదా అనేదానిపై స్పష్టత లేదు. చూద్దాం.. రేపు మన ఫోన్లలో పేర్లు కనబడితే సర్వీస్​ మొదలైనట్లు, లేకపోతే ఇక ఎప్పుడో..