Nvidia Invests $5 billion In Intel | ఇంటెల్ లో ఎన్ వీడియా 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

ఎన్‌వీడియా ఇంటెల్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించగా, ఇంటెల్ షేర్లు ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో 30% పెరిగాయి.

Nvidia Invests $5 billion In Intel | ఇంటెల్ లో ఎన్ వీడియా 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

విధాత : దిగ్గజ చిప్ తయారీ కంపెనీ ఎన్ వీడియా కంప్యూటర్ ప్రాసెసర్ల తయారీ కంపెనీ ఇంటెల్ లో భారీగా పెట్టుబడులు ప్రకటించింది. ఏకంగా 5 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో ఇది దాదాపు రూ. 44 వేల కోట్లకుపైనే) ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. పర్సనల్ కంప్యూటర్స్, డేటా సెంటర్లకు సెమీకండక్టర్లను అభివృద్ధి చేసేందుకే ఈ పెట్టుబడులు అని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా.. ఎన్విడియో ఒక్కో షేరుకు 23.28 డాలర్ల చొప్పున ఇంటెల్ స్టాక్‌ను కొనుగోలు చేయనుంది.
గత నెలలో ఇంటెల్‌లో 10 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అమెరికా ప్రభుత్వం ఒక్కో షేరుకు చెల్లించిన 20.47 ధర కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఎన్ వీడియా భారీ పెట్టుబడితో ఇబ్బందుల్లో ఉన్న ఇంటెల్‌కు ఊరట కలిగినట్లయింది. తాజా పరిణామాల మధ్య ప్రీమార్కెట్‌ ట్రేడింగ్‌లో ఇంటెల్‌ షేర్లు 30% పెరగడం గమనార్హం.

ఎన్ వీడియా తాజా పెట్టుబడులతో ఇంటెల్ కార్పోరేషన్ లో అతిపెద్ద వాటాదారులలో ఒకటిగా నిలుస్తుంది. ఒప్పందం మేరకు కొత్త షేర్లు జారీ చేయబడిన తర్వాత కంపెనీలో దాదాపు 4 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటాను ఎన్ వీడియా పొందనుంది.