సామ్​సంగ్ ​ఫోల్డబుల్స్ కొత్త తరం వచ్చేసింది!

సామ్​సంగ్ ​తమ నూతన తరం ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. గెలాక్సీ Z ఫోల్డ్ 7, Z ఫ్లిప్ 7, అలాగే బడ్జెట్ రేంజ్‌కు దగ్గరగా ఉండే ఫ్లిప్ 7 FE లను కంపెనీ లాంచ్‌ చేసింది.

సామ్​సంగ్ ​ఫోల్డబుల్స్ కొత్త తరం వచ్చేసింది!

హైదరాబాద్, జూలై 9 (టెక్​ డెస్క్​): ఫోల్డబుల్‌ ఫోన్ల విభాగంలో మళ్లీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు, సామ్​సంగ్ ​తమ నూతన తరం ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. గెలాక్సీ Z ఫోల్డ్ 7, Z ఫ్లిప్ 7, అలాగే బడ్జెట్ రేంజ్‌కు దగ్గరగా ఉండే ఫ్లిప్ 7 FE లను కంపెనీ లాంచ్‌ చేసింది. ఈ ఫోన్లు సాంకేతికంగా మాత్రమే కాకుండా మేధోపరంగా కూడా అత్యున్నత స్థాయిలో రూపొందించబడ్డాయి. గూగుల్ జెమిని AI సహకారంతో పని చేసే ఫీచర్లు, సరికొత్త డిజైన్‌, ప్రాసెసింగ్ శక్తి మరియు కెమెరా సామర్థ్యం ఈ కొత్త ఫోన్ల విశిష్టతలు.

గెలాక్సీ Z ఫోల్డ్ 7 :  పలుచటి ఆకారం ‌‌–  గొప్ప తెలివితేటలు

  • చరిత్రలోనే అత్యంత సన్నగా ఉండే ఫోల్డ్‌ ఫోన్ ఇదే.
  • పలుచనైన డిజైన్: మడిచినపుడు కేవలం9mm, తెరిచినపుడు 4.2mm మందంతో, ఈ ఫోన్‌ బరువు కేవలం 215 గ్రాములు.
  • తెర విస్తరణ: కవర్‌ స్క్రీన్‌5 అంగుళాలు, ప్రధాన స్క్రీన్‌ 8 అంగుళాలు (మునుపటి తరం కంటే 11% ఎక్కువ).
  • కస్టమ్ Snapdragon 8 Elite ఫర్ గెలాక్సీ ప్రాసెసర్ వాడటం వలన CPU, GPU, NPU పనితీరు గణనీయంగా మెరుగైంది. ఈ ప్రాసెసర్​ను ప్రత్యేకంగా గెలాక్సీ ఫోన్ల కోసమే రూపొందించారు.
  • కెమెరా విప్లవం: గత మోడల్‌లో 50MP ఉండగా, ఇది 200MP వైడ్‌ యాంగిల్‌ కెమెరాతో రానుంది.
  • స్టైలస్‌ అభిమానులకు నిరాశ: ఫోల్డ్ 6లో ఉన్న S-Pen ను ఫోల్డ్ 7లో తీసేసారు. దీనివల్లనే పలుచని డిజైన్ సాధ్యమైందని కంపెనీ చెబుతోంది.

గెలాక్సీ Z ఫ్లిప్ 7 : స్టైల్తో కూడిన పనితనం

  • ఫ్లెక్స్ విండో విస్తృతం: కొత్తగా1 అంగుళాల ఎడ్జ్-టు-ఎడ్జ్‌ కవర్‌ డిస్‌ప్లే, ఇది ఫ్లిప్ 6లో 3.4 అంగుళాలు మాత్రమే ఉండేది.
  • బ్యాటరీ సామర్థ్యం పెరిగింది: 4,000mAh నుండి 4,300mAh కు పెంపు.
  • దైనందిన పనులను తేలికగా నెరవేర్చేలా ఫ్లెక్స్‌ మోడ్, కస్టమ్ AI ఇంటిగ్రేషన్‌తో పనులు వేగంగా పూర్తి చేసే సామర్థ్యం.
  • 7mm మందంతో ఇది ఇప్పటి వరకూ వచ్చిన పలుచటి Flip ఫోన్.

గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE :  ఫోల్డబుల్ని ఫోన్అందరికీ అందుబాటులో..

  • ఎంట్రీ లెవెల్ ఫోల్డబుల్‌ గా7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ప్రధాన డిస్‌ప్లే, 50MP “ఫ్లెక్స్‌కామ్‌” తో రానుంది.
  • ధర తగ్గించేందుకు కొన్ని ఫీచర్లను తగ్గించారు. 4,000mAh బ్యాటరీ, 128GB / 256GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి.

 

AI ఫోకస్ గూగుల్ జెమినితో కొత్తగా..

One UI 8 (Android 16) ఆధారంగా నడిచే ఈ ఫోన్లు Gemini Live అనే కొత్త ఫీచర్‌ తో వస్తున్నాయి. ఇందులో:

  • హ్యాండ్స్‌ ఫ్రీ వాయిస్‌ కమాండ్స్‌ (విమాన టిక్కెట్లు, హోటల్‌ వివరాలు, ఫుడ్‌ ఆర్డర్‌)
  • కెమెరా షేరింగ్ ద్వారా రియల్ టైమ్ విజువల్ సహాయం
  • ఫోటో అసిస్టు, ఆడియో ఎరేసర్ వంటి ఎడిటింగ్ టూల్స్‌

 

ధరలు (భారత్‌లో):

మోడల్ ప్రారంభ ధర
Galaxy Z Flip 7 FE ₹89,999
Galaxy Z Flip 7 ₹1,09,999
Galaxy Z Fold 7 ₹1,74,999
Galaxy Watch 8 ₹32,999 ప్రారంభ ధర

 

ఈ ఫోల్డబుల్‌ ఫోన్లు వాడకంలో స్టైల్‌, పనితీరులో శక్తివంతంగా ఉండేలా రూపొందించబడ్డాయి. వర్క్ & ఒంటిచేతి వాడకం  కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరోసారి సామ్​సంగ్ ​ఆధిపత్యాన్ని నిరూపించనున్నాయనే నమ్మకం టెక్‌ వర్గాల్లో ఉంది. ప్రధాన పోటీదారైన ఆపిల్​ కూడా వచ్చే ఏడాది ఫోల్డబుల్​ ఫోన్ల రంగంలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, సామ్​సంగ్​ చాలా జాగ్రత్త పడింది. ఇప్పటికే ఫోల్డబుల్​ ఫోన్ల విషయంలో చాలా ముందున్న సామ్​సంగ్​ను సవాల్​ చేయడం ఆపిల్​కు కష్టసాధ్యమైన విషయంగా మొబైల్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.