Group-1 Aspirant | ఈ మోసాల మధ్య ఉద్యోగం రాదన్న..! అవకాశం వెళ్లిపోతుందని ప్రాణం పోతోంది..!! వీడియో
Group-1 Aspirant | రాష్ట్రంలోని నిరుద్యోగల( Un Employees ) పట్ల ఏ ప్రభుత్వానికి కనికరం లేదు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం.. ఈ ప్రభుత్వంలో కూడా అదే ధోరణి. నిరుద్యోగుల అభ్యర్థనలు పట్టించుకోకుండా.. నాడు బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఒంటెద్దు పోకడ పోతున్న పరిస్థితి.

Group-1 Aspirant | నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో.. నిరుద్యోగుల( Un Employees ) బాధలు వర్ణణాతీతం. గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం అని కాదు.. ఏ ప్రభుత్వంలోనైనా నిరుద్యోగ అభ్యర్థులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.. కన్నీళ్లు పెట్టిస్తూనే ఉన్నాయి. అమ్మ తన మెడలో ఉన్న తాళిబొట్టు కుదువపెట్టి తెచ్చిన డబ్బుతో కోచింగ్‌లకు పోయి.. ఒక పూట తిని, మరో పూట పస్తులుండి.. పుస్తకాల పురుగులై ప్రభుత్వ ఉద్యోగాలకు( Govt Jobs ) ప్రిపేరవుతున్న నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. ప్రతి నోటిఫికేషన్‌లో నిర్లక్ష్యం.. అవకతవకలు.. కోర్టులకు వెళ్లినా కూడా జరగని న్యాయం.. చివరకు నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలే.. ఆ నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్న వైనం. ఇది చివరి అవకాశమని రాత్రింబవళ్లు కష్టపడి ప్రిపేరైనా అభ్యర్థులకు ప్రస్తుత రేవంత్ సర్కార్ చుక్కలు చూపిస్తున్న పరిస్థితి.
గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ( Group-1 Prelims Key )లో తప్పులు ఉన్నాయని, తెలుగు అకాడమీ( telugu Academy ) పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలని హైకోర్టు( High Court )ను ఆశ్రయిస్తే.. వికీపీడియాను ప్రామాణికంగా తీసుకుంటామని టీజీపీఎస్సీ( TGPSC ) నిర్లక్ష్యపు సమాధానాలు. కోర్టు కూడా టీజీపీఎస్సీ నిర్ణయాన్ని సమర్థించడం. కీలో తప్పులు సరిదిద్దకపోవడంతో కొన్ని వేల మంది ఈ గ్రూప్-1 మెయిన్స్‌కు దూరమయ్యారు. కొన్నేండ్ల పాటు తెలుగు అకాడమీ పుస్తకాలను చదువుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వారి పరిస్థితి బూడిదలో పోసిన పన్నీరై పోయింది.
ఇక ఎల్లుండి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తమ గోడును వినిపించేందుకు గ్రూప్-1 అభ్యర్థులు( Group-1 Aspirants ) అశోక్ నగర్( Ashok Nagar ) నుంచి సచివాలయానికి ర్యాలీగా వెళ్లారు. అయితే ఓ నిరుద్యోగ అభ్యర్థి సచివాలయం వద్ద సొమ్మసిల్లిపోయాడు. నాకు చావే దిక్కు అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. రెండు సంవత్సరాల నుండి తెలుగు అకాడమి బుక్స్‌తో చదువుకున్నా.. ఇప్పుడు తెలుగు అకాడమి బుక్స్ చెల్లవు అని అంటున్నారు. ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఆ అభ్యర్థి కన్నీరు పెట్టుకున్నాడు. గుండెలవిసేలా రోదించాడు.
నాకు చావే దిక్కు అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన గ్రూప్స్ అభ్యర్థి.
రెండు సంవత్సరాల నుండి తెలుగు అకాడమి బుక్స్‌తో చదువుకున్నా.. ఇప్పుడు తెలుగు అకాడమి బుక్స్ చెల్లవు అని అంటున్నారు.
ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారింది. pic.twitter.com/c9iWr6kPod
— Telugu Scribe (@TeluguScribe) October 19, 2024