హన్మకొండలో హీరోయిన్ రాశి ఖన్నా సందడి
హీరోయిన్ రాశి ఖన్నా బుధవారం సందడి చేశారు. ఈ సందర్భంగా నయీంనగర్ లో ఓ షాపింగ్ మాల్ ను ఆమె ప్రారంభించారు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హీరోయిన్ రాశి ఖన్నా బుధవారం సందడి చేశారు. ఈ సందర్భంగా నయీంనగర్ లో ఓ షాపింగ్ మాల్ ను ఆమె ప్రారంభించారు. ఆమెతో పాటు మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి కూడా ఉన్నారు. రాశిఖన్నా అభిమానులు కేరింతలతో సందడి చేశారు. లవ్ యూ అల్ అని అందరిని పలకరించింది. వరంగల్ షూటింగ్స్ కోసం చాలాసార్లు వచ్చానని, ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం మీడియా వారితో రాశి కన్నాసెల్ఫీ ఫొటో తీసుకున్నారు.