Inter Admissions | నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు.. ‘యాంటీ డ్రగ్ అఫిడవిట్’ తప్పనిసరి..!
Inter Admissions | ఎన్నో సందిగ్ధతల మధ్య.. చివరకు ఇంటర్ ప్రవేశాలకు( Inter Admissions ) లైన్ క్లియర్ అయింది. పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలనే ప్రతిపాదనను విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు తీవ్రంగా వ్యతిరేకించారు.
Inter Admissions | ఎన్నో సందిగ్ధతల మధ్య.. చివరకు ఇంటర్ ప్రవేశాలకు( Inter Admissions ) లైన్ క్లియర్ అయింది. పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలనే ప్రతిపాదనను విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో 2026-27 విద్యా సంవత్సరానికి పాత పద్ధతిలోనే ఇంటర్ ఫస్టియర్( Inter First Year )లో ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
అయితే విద్యార్థులకు యాంటీ డ్రగ్ అఫిడవిట్( anti-drug affidavit )ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఫస్టియర్‌లో ప్రవేశం పొందే విద్యార్థులు ఈ అఫిడవిట్‌ను తప్పనిసరిగా సమర్పించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులు, తమ తల్లిదండ్రులు సమ్మతితో ఈ అఫిడవిట్‌ను తయారు చేయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రవేశాలు పొందిన తర్వాత విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు.
వ్యతిరేకిస్తున్న జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్
యాంటీ డ్రగ్ అఫిడవిట్ ప్రతిపాదనను తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు అధ్యక్షుడు వసుకుల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్ తెలిపారు. ఒక వేళ అఫిడవిట్ తప్పనిసరి అయితే.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లాయర్ల వద్దకు క్యూ కట్టాలన్నారు. ఇది విద్యార్థులకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. ఈ అఫిడవిట్ అనవసరం అని పేర్కొన్నారు. ప్రవేశం సమయంలోనే విద్యార్థుల, వారి తల్లిదండ్రులను రాతపూర్వకంగా డిక్లరేషన్ రాయించుకుంటే సరిపోతుందన్నారు.
నేటి నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో మంగళవారం నుంచి ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. మే 31 వరకు తొలి విడుత అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ప్రవేశ పరీక్షలు వద్దు..
ఇంటర్ ఫస్టియర్‌లో చేరే విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించొద్దని ఇంటర్ బోర్డు ఆదేశించింది. కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలన్నారు. మెరిట్ మార్కులు వచ్చిన విద్యార్థులకు మొదటగా అవకాశం కల్పించాలని ఆదేశించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram