Bakka Judson : రేవంత్ అప్పులపై రిజర్వ్ బ్యాంకులో పిటిషన్
రేవంత్ ప్రభుత్వ అప్పులపై ఆర్బీఐలో బక్కా జడ్సన్ పిటిషన్. హామీలు అమలు చేయకుండా భారీ అప్పులు తెచ్చారని ఆరోపణలు, మూసీ ప్రాజెక్టుపై కూడా విమర్శలు.
విధాత, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాపెడా చేస్తున్న అప్పుల అంశంపై ఈ నెల 26న రిజర్వ్ బ్యాంకులో పిటిషన్ వేయడం జరిగిందని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్తగా మూసీ బ్యూటిఫికేషన్, ఫ్యూచర్ సిటీ, రెడియల్ రోడ్లు అంటూ ఏవో కథలు చెబుతున్నాడని విమర్శించారు.
తెలంగాణకు రిజర్వ్ బ్యాంకు ఇచ్చేదానికంటే అధికంగారూ.15,139 కోట్ల అప్పు ఎక్కువ తెచ్చుకున్నాట్లుగా తెలిపారు.రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ఇంత అప్పు తెచ్చి ఏం చేస్తున్నాడు? అని ప్రశ్నించారు. రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఈరోజు తెలంగాణకు అప్పు ఇవ్వనంటుందని, ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ తెస్తా అంటున్నాడన్నారు. కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసం మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో నాటకం చేస్తున్నారని, దీనికోసం నిధులే లేవన్నారు. మూసీ బ్యూటిఫికేషన్, హైడ్రాల మాటునా రియల్ ఎస్టేట్, సెటిల్మెంట్లు చేసుకును ఎత్తగడలు చేస్తున్నారన్నారు. త్రిబుల్ ఆర్ కు డబ్బులు లేవని భూసేకరణ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అప్పులు..ఖర్చు చేస్తున్న నిధులపై ఆర్థిక మంత్రి భట్టి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కొండూరులో రెడియల్ రోడ్డు కోసం రైతులను రూములలో బంధించి భూసేకరణ చేస్తున్నారని, రైతుల తరపున మాట్లాడితే 70 కిలోమీటర్లు తిప్పి నందిగామ పోలీస్ స్టేషన్లో నన్ను నిర్బంధించారన్నారు. తెలంగాణలో ఈరోజు మీడియాలో ఏ న్యూస్‌లో ఏం రావాలి, ఏం వెయ్యాలని ఆంధ్రా వాడు చెప్తున్నాడని ఆరోపించారు. మన తెలంగాణలో ఇంతమంది అనుభవం ఉన్న మీడియా ప్రతినిధులు ఉండగా, శ్రీరామ్ కర్రీ అనే ఆంధ్రా అతన్ని ఎందుకు పెట్టుకున్నారు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఈ రోజు 8 మంది సలహాదారులను ఆంధ్రా నుండి తెచ్చిపెట్టుకున్నాడు, ఎందుకు ఇక్కడ లేరా? అని ప్రశ్నించారు. రిటైర్డు ఉద్యోగులు, పోలీసులు, అవుట్ సోర్సింగ్, ఫీజు రీయంబర్మెంట్, ఆశా వర్కర్లు వంటి వారి సమస్యలపై మాత్రం న్యూస్ రావడం లేదన్నారు. ఏ రోజు ఏ న్యూస్ రావాలో శ్రీరామ్ కర్రీ నిర్ణయిస్తున్నారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి :
MLA Sudheer Reddy : దోమలను అరికట్టండి మహాప్రభో : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన
తెలంగాణలో గడ్డిమందుపై నిషేధం.. అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై ఆంక్షలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram