Bandi Sanjay : సింగర్ గా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ సింగర్‌గా మారి ఆర్ఎస్ఎస్ 100ఏళ్ల సందర్భంగా దేశభక్తి గీతాలు పాడారు. కరీంనగర్‌లో పాటల వీడియోలు విడుదలయ్యాయి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Mar 27, 2026, 3:12 pm IST
Read Time: 4 mins
Bandi Sanjay : సింగర్ గా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్

విధాత : బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సింగర్ గా కొత్త అవతారం ఎత్తారు. ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) 100ఏళ్ల వేడుక సందర్బంగా సంఘ్ గీతాల వీడియోలు విడుదల చేశారు. ఇందులో బండి సంజయ్ స్వయంగా పాడిన రెండు పాటలు కూడా ఉన్నాయి.

పాటలకు సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీత స్వరాలు సమకూర్చారు. బండి సంజయ్ పాడినటువంటి రెండు పాటలు.. గళమెత్తి పాడాలి, మాతృ మూర్తి పదాల ముందర పాటల వీడియోలను ఈరోజు కరీంనగర్ విడుదల చేశారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) స్థాపించి శత వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ గీతాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో బండి సంజయ్ ఈ గీతాలను ఆలపించారు. బండి సంజయ్ చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో పనిచేశారు. జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా పుణికి పుచ్చుకున్న బండి సంజయ్ చిన్ననాటి సంఘ్ పాటలను పాడేవారు. సంఘ్ అంతర్గత సమావేశాల్లో, సభల్లో సంజయ్ దేశభక్తి గీతాలు పాడేవారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ శతవసంతాలు పూర్తయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలను సామాన్య ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సన్నిహితుల సూచించడంతో బండి సంజయ్ ఈ గీతాలను విడుదల చేశారు.

నిన్న ఈ వీడియోలకు సంబంధించి ప్రోమో విడుదలైన కొన్ని గంటల్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈరోజు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో వేలాది మంది భక్తులు, చిన్నారుల సమక్షంలో బండి సంజయ్ ఈ గీతాల వీడియోలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రచయిత ఆకుల నాగేశ్వర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి :

Bhadrachalam Temple | భద్రాచలం అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
Telangana Heavy Rains : తెలంగాణకు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్!