రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరి : బీజేపీ ఎమ్మెల్యే కాటెపల్లి విమర్శ

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరితో కూడిన మాటలు చెబుతున్నాడని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందంటునే ఇంకోవైపు వేలకోట్ల కొత్త పథకాలకు శంకుస్థాపనల ప్రకటనలు చేస్తున్నాడని బీజేపీ ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరి : బీజేపీ ఎమ్మెల్యే కాటెపల్లి విమర్శ

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరితో కూడిన మాటలు చెబుతున్నాడని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందంటునే ఇంకోవైపు వేలకోట్ల కొత్త పథకాలకు శంకుస్థాపనల ప్రకటనలు చేస్తున్నాడని బీజేపీ ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రతి పక్షంలో కూర్చో పెట్టారని, రేవంత్ సర్కార్ ఏమీ చేస్తామో చెప్పకుండా గత ప్రభుత్వాన్నీ విమర్శించడం పనిగా పెట్టుకుందన్నారు. అప్పులపాలైన తెలంగాణాలో 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఎలా జరుగుతుందని,1లక్ష 50 వేల కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన ఎలా అవుతుందని, అక్బరుద్దీన్ ఓవైసీకి రూ.300 కోట్లు ఎలా ఇస్తామని అంటున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదో చెప్పమని అడిగితే చెప్పరని, అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే సినిమా చూసినట్టు చూస్తారని, బీజేపీ సభ్యులకు టైమ్ ఇవ్వమంటే ఇవ్వరన్నారు. అసెంబ్లీలో బూతు పురాణం మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని రిటైర్డు అధికారులతో నడిపిస్తున్నారని, వారి తర్వాత ఉన్న ఉద్యోగులు అసమర్థులా అని ప్రశ్నించారు. మంత్రుల పేషీలో 20 మంది ఉన్నారని, తమ వాళ్ళను పెట్టుకుంటున్నారని, దీని వల్ల ప్రజాధనం వృథా అవుతుందని వెంకట రమణ రెడ్డి పేర్కొన్నారు. ఒక్కో ఐఏఎస్ కు 8 డిపార్ట్ మెంట్ లు ఇస్తున్నారని, ఐఏఎస్ లు బదిలీ అయితే అయనతో పని చేసిన వారిని తీసుకు పోతున్నారని, ఆంధ్ర కేడర్ కు చెందిన అధికారులను సలహాదారులుగా ముఖ్యమంత్రి పెట్టుకున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీలో వచ్చే డబ్బులు జీహెచ్ఎంసీ పరిధిలోనే పెట్టాలని, కొడంగల్, మధిరకు ఎందుకు పోతున్నాయని కాటేపల్లి రమణ రెడ్డి ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీలో 500కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు.