విధాత, హైదరాబాద్ : మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం నిర్మాణం మాటునా సీఎం రేవంత్ రెడ్డి సోదరులు భూదందా దాగి ఉందని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేస్తుంది. ఆ వీడియో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితకు చెందిన పాత వీడియో కావడం గమనార్హం. మూసీ సుందరీకరణ పేరుతో అనుముల అన్నదమ్ములు చేస్తున్న భూ దోపిడీకి ఈ వీడియో నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అనుముల అన్నదమ్ముల భూ దోపిడీ భాగోతం స్వయంగా కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఆరు నెలల ముందే బయటపెట్టిందని, మంచిరేవులలోని వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన భూమిని చెరబట్టేందుకు రేవంత్ బ్రదర్స్ కుట్రలు చేసి, ఆ పక్కనే ఉన్న మిగతా భూములను కూడా దోచేయాలని స్కెచ్ వేశారని బీఆర్ఎస్ తన పోస్టులో ఆరోపించింది.
అనుముల బ్రదర్స్ భూ దోపిడీ కోసమే ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అని, ఓంకారేశ్వర ఆలయం కడుతున్నామన్న నెపంతో పక్కనే ఉన్న విలువైన భూములను అనుముల అన్నదమ్ములు దోచుకునే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ తన పోస్టులో ఆరోపించింది. తెలంగాణ వ్యాప్తంగా దోచుకుంటున్న పేదల భూములు చాలవన్నట్టు.. చివరికి దేవుడి మాన్యాలను కూడా అనుముల బ్రదర్స్ వదలడం లేదు అని… ఏకంగా దేవుడి భూములపై కన్ను వేశారని బీఆర్ఎస్ ఆరోపించింది.
మరో వైపు దేవాదాయ శాఖ మంత్రి లేకుండానే సీఎం రేవంత్ రెడ్డి ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా గుర్తు చేస్తుంది. గతంలో మంచిరేవులలో సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ దేవాలయ భూముల కబ్జాలు చేస్తున్నారని సురేఖ కూతురు కొండా సుస్మత ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే మంత్రి సురేఖను ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచారని ఆరోపిస్తుంది.
మూసీ సుందరీకరణ పేరుతో అనుముల అన్నదమ్ములు చేస్తున్న భూ దోపిడీ ఇది!
తెలంగాణ వ్యాప్తంగా దోచుకుంటున్న పేదల భూములు చాలవన్నట్టు.. చివరికి దేవుడి మాన్యాలను కూడా అనుముల బ్రదర్స్ వదలడం లేదు. ఏకంగా దేవుడి భూములపై కన్ను వేశారు.
అనుముల అన్నదమ్ముల భూ దోపిడీ భాగోతం స్వయంగా కాంగ్రెస్ మంత్రి… pic.twitter.com/uTP2qinDat
— BRS Party (@BRSparty) March 28, 2026
ఇవి కూడా చదవండి :
నా కడుపులో విరాట్ కోహ్లీ బిడ్డను మోస్తున్నా..యువతి హల్చల్
TG Assembly | అసెంబ్లీ నుంచి మరోసారి బీఆర్ఎస్ వాకౌట్
