విధాత : నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. మనవడికి అక్షరాభ్యాసం చేయించారు.
తర్వాత ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ చేశారు. రూ.225 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని పునరభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ఈ ప్లాన్‌లో ఆలయ రీడెవలప్‌మెంట్ నమూనాలోని ఒక భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.
ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. బోథ్ నియోజకవర్గం అడేగామా గ్రామంలో రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 45.15 కోట్లతో బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి, రూ. 20.10కోట్లతో శ్రీ నాగోబా దేవస్థానం అభివృద్ధి, సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ. 20కోట్లతో నిర్మించిన ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికలు) భవనానికి ప్రారంభోత్సవం చేశారు. రూ 13.46 కోట్లతో నిర్మించిన సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన వంతెనను ప్రారంభించారు. ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ లో రూ 15.00 కోట్లతో నిర్మించే ఐటీడీఏ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ 30కోట్లతో బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ రోడ్డు నుండి డెడ్రా గ్రామం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, రూ 20.00 కోట్ల నిర్మించిన జైనథ్ లో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యా పాఠశాల (బాలురు) భవనానికి ప్రారంభోత్సవం చేశారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రూ 30 కోట్లతో చేపట్టిన 38 వివిధ రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
బోథ్ నియోజకవర్గం ధన్నూర్, కుప్టి, కుచ్లాపూర్ లలో రూ 8.99 కోట్లతో నిర్మించే మూడు 33/11KV విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ 50.70 కోట్లతో బోథ్ నియోజకవర్గంలో పిప్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, రూ 44.64 కోట్లతో తేజాపూర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి మండలంలో రూ 65.85కోట్లతో ముత్నూర్ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ (త్రివేణి సంగం) పథకానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో లాండసాంగి పంప్ హౌస్ దగ్గర రూ 6.435 కోట్లతో చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలంలో 31.52 కోట్లతో చిక్ మన్ వాగు ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో రూ 11.76 కోట్లతో అమ్మనమడుగు వాగు ప్రాజెక్ట్ రిపేర్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఇవి కూడా చదవండి :
సినీ పరిశ్రమలో విషాదం.. నటి సుభాషిణి సూసైడ్ !
మామల్లపురం తీరంలో అమ్మవారి విగ్రహం లభ్యం!
