సినీ పరిశ్రమలో విషాదం.. నటి సుభాషిణి సూసైడ్ !
చెన్నైలో టీవీ నటి సుభాషిణి ఆత్మహత్య కలకలం. భర్తతో విభేదాల నేపథ్యంలో ఉరేసుకుని మృతి. సినీ, టీవీ రంగంలో విషాదం నెలకొంది.
విధాత : సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (36) సుభాషిణి చైన్నైలోని పోరూరులో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఓ ప్రైవేట్ అపార్ట్ మెంట్ లో ఉరేసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుంది. భర్తతో విబేధాల నేపథ్యంలో సుభాషిణి ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తుంది. ఆత్మహత్యకు ముందు కూడా భర్తతో వీడియో కాల్ లో జరిగిన గొడవతో మనస్తాపానికి గురై ఆమె సుసైడ్ చేసుకుందని సమాచారం. సుభాషిణి ఆత్మహత్యకు పాల్పడిన సమాచారం సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న పోరూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సుభాషిణి పలు టీవీలు, సినిమాల్లో నటించింది. సన్ టీవీ సీరియల్ కాయల్ లో కీలకపాత్ర పోషించిన సుభాషిణి మంచి ప్రేక్షాకాదరణ అందుకుంది. సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉండే సుభాషిణికి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకుపైగా ఫాన్ ఫాలోవర్స ఉన్నారు. శ్రీలంక కుటుంబ నేపథ్యం కల్గిన నటి సుభాషిణి, తన భర్త పిప్పిన్‌తో కలిసి బెంగళూరులో నివాసం ఉండేది. అయితే షూటింగ్‌ల కారణంగా చెన్నైలోని అయ్యప్పంతంగళ్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తుంది. మరోవైపు సుభాషిణి ఏప్రిల్ 12న తన పుట్టినరోజును జరుపుకోవాల్సి ఉంది. ఇదే నెల ఏప్రిల్ 21న ఆమె రెండవ వివాహ వార్షికోత్సవం కూడా ఉంది. అంతకుముందే ఆమె ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబ సభ్యులను, సన్నిహితులను కలిచివేసింది.
ఇవి కూడా చదవండి :
మామల్లపురం తీరంలో అమ్మవారి విగ్రహం లభ్యం!
కోహెడ పండ్ల మార్కెట్ భూమికి కాంగ్రెస్ ఎసరు: హరీశ్ రావు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram