విధాత : సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రైవేట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరవుతారు.
తెలంగాణ నుంచి రెండవసారి రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వీ ఈ విందు ఏర్పాటు చేశారు. రేవంత్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ సహా పార్టీకి సంబంధించి పలు కీలక అంశాలను హైకమాండ్ తో చర్చించనున్నట్లుగా సమాచారం. అటు రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు, అనుమతులపై కేంద్ర మంత్రులను రేవంత్ కలువనున్నారు.
ఇవి కూడా చదవండి :
Covid 19 Lockdown | ఇండియాలో లాక్‌డౌన్.. గూగుల్ సెర్చ్‌లో టాప్
నాకు రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
