కవితను బీజేపీనే కాపాడుతుంది.. సీపీఐ నేత నారాయణ ధ్వజం

సీఎం కేసీఆర్‌ కుమార్తె ఎమ్మెల్సీ కవితను లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కాపాడుతుందని సీపీఐ నారాయణ ఆరోపించారు

కవితను బీజేపీనే కాపాడుతుంది.. సీపీఐ నేత నారాయణ ధ్వజం

విధాత : సీఎం కేసీఆర్‌ కుమార్తె ఎమ్మెల్సీ కవితను లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కాపాడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. బుధవారం ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ లిక్కర్‌ స్కామ్‌ కేసులో రాజీ ఒప్పందం తర్వాతానే వైసీపీ, కేసీఆర్‌, బీజేపీలు కలిసే ఆమ్‌ ఆద్మీ పార్టీని అంతం చేసే కుట్ర పన్నారన్నారు. ఈ క్రమంలోనే డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను జైల్లో పెట్టారన్నారు.

అంతా కలిసి సిసోడియను కేసులో ఇరికించారన్నారు. ఆదాని కుంభకోణంలో సెబీ ఎంక్వయిరీ వేయని కేంద్ర సంస్థలు సత్యం రామలింగరాజు కేసులో మాత్ర సెబీ ఎంక్వయిరీ చేశారన్నారు. ఇవన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను తనకు అనుకూలంగా వినియోగించుకుంటు ప్రత్యర్ధి పార్టీలను నిర్వీర్యం చేసేందుకు దుర్వినియోగం చేస్తున్నాయనడానికి నిదర్శనమన్నారు.