CPI | ప్రభుత్వ భూములను కాపాడాలి: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

CPI | ప్రభుత్వ భూములను కాపాడాలి: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

CPI | కబ్జా కోర్ల చేతిలో చిక్కుకున్న ప్రభుత్వ భూములను రక్షించి పేదలకు పంచాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం వరంగల్లో బుధవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడా బాబుల, కబ్జాకోరుల మధ్య అన్యాక్రాంతమైన, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను పేద ప్రజలకు పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సీపీఐ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని, ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే సమాజంలో ప్రజలకు రక్షణ ఉంటుందని చెప్పారు. వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది పేదలను సమీకరించి భూపోరాటాలు నిర్వహించిన చరిత్ర సీపీఐ దేనని అన్నారు.
అంతకుముందు సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి ఎర్ర జెండా ఎగురవేశారు. అనంతరం అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. సుంకరి భవానీ, నల్లతీగల కుమార్ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ కే బాష్ మియా, పనాస ప్రసాద్, జిల్లా నాయకులు గన్నారపు రమేష్, దండు లక్ష్మణ్, తాళ్లపెల్లి జాన్ పాల్ ఓర్సు రాజు, గుండె బద్రి, ల్యాదెళ్ల శరత్ తదితరులు పాల్గొన్నారు.