BJP MLA Harish Babu | నిధులైనా ఇవ్వండి.. లేదంటే మహారాష్ట్రలో కలపండి : బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌బాబు
సిర్పూర్ ప్రాంతానికి ప్రభుత్వాలు మొదటి నుంచి అన్యాయం చేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయంతో పాటు ఫ్రస్తుత బడ్జెట్‌లోనూ మా ప్రాంతానికి తగిన కేటాయింపు లేవని విమర్శించారు. కు నిధులు కేటాయించండి

విధాత, హైదరాదాబాద్ : సిర్పూర్ ప్రాంతానికి ప్రభుత్వాలు మొదటి నుంచి అన్యాయం చేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయంతో పాటు ఫ్రస్తుత బడ్జెట్‌లోనూ మా ప్రాంతానికి తగిన కేటాయింపు లేవని విమర్శించారు. కు నిధులు కేటాయించండి..మా ప్రజల జీవన ప్రమాణాలు పెంచండని, లేకపోతే మమ్మల్ని మహారాష్ట్రలో కలపండంటూ హరీష్ బాబు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆరెస్ ప్రభుత్వ హయంలో మహారాష్ట్ర, ఏపీ సరిహద్ధు గ్రామాల వారు తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నట్లుగా ఆనాటి సీఎం కేసీఆర్ చెప్పుకోగా, అందుకు భిన్నంగా పాల్వాయి హరీశ్‌బాబు మాత్రం తమను మహారాష్ట్రలో కలపండంటూ కోరడం చర్చనీయాంశమైంది. అంతకుముందు సోమవారం అర్ధరాత్రి దాటేంతవరకు కొనసాగిన సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే పైడ్ రాజేష్ రెడ్డి గల్ఫ్ కార్మికుల ససమస్యలు, నియోజకవర్గంలో స్కూళ్ల సమస్యలపై మాట్లాడినతీరు సభను ఆకట్టుకుంది. గల్ఫ్ కార్మికుల సమస్యలు కోసం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలని.. ఇతర దేశాలకు కార్మికులుగా వెళ్లిన వారి బ్రతుకులు అగమ్యగోచరంగా మారిపోతున్నాయని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు సగం కూలిన గోడలు, తుప్పు పట్టిన ఇనుముతో పిల్లర్లు కూలిపోతున్నాయని.. దయచేసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని, నిధులు విడుదల చేయాలని చేతులెత్తి మొక్కుతున్నానని మాట్లడిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.