ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం భిక్షాటనతో నిరసన

పెండింగ్‌లో ఉన్న రూ.9000 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్ధి సంఘం నల్లగొండ నగరంలోని ప్రధాన పురవీధుల్లో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపింది.

విధాత : పెండింగ్‌లో ఉన్న రూ.9000 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్ధి సంఘం నల్లగొండ నగరంలోని ప్రధాన పురవీధుల్లో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నలగొండ నగర సంయుక్త కార్యదర్శి బత్తుల శివ చరణ్ మాట్లాడుతూ…స్కాలర్షిప్‌లు ఇవ్వలేని ప్రభుత్వానికి విద్య గురించి మాట్లాడే అర్హతే లేదు అన్నారు. వేల కోట్ల బకాయిలను నిలిపివేసి విద్యార్థులను అప్పుల బారిన పడేస్తోందని వారన్నారు.

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ పథకాన్ని ఆపేసే కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. అదే కుట్ర జరిగితే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉధృతమైన ఆందోళనలు చేపడతామని అవసరమైతే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని ఘాటుగా హెచ్చరించారు.ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు రావాల్సిన తొమ్మిది వేల కోట్ల రూపాయల స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని వారన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సిద్దు,శివ,పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News